విజయనగరం ( జనస్వరం ) : పట్టణంలో పలు ప్రధాన కూడళ్లలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కు పల్లకి మూస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్ పోటోతో పేదలకి పెత్తందారులకి మధ్య జరిగే యుద్ధం అని జనసైనులకు, పవన్ అభిమానుల మనోభావాలను కించపరిచేలా వేసిన ఫ్లెక్సీలు తక్షణమే తొలగించాలని జనసేన పార్టీ నాయకులు గురాన అయ్యలు డిమాండ్ చేశారు. శుక్రవారం ఉదయాన్నే పట్టణంలో వెలసిన ఈ ఫ్లెక్సీలు ప్రజల్లో చర్చినీయాంశంగా మారడంతో జనసేన నాయకులు గురాన అయ్యలు అడిషనల్ సూపరెండెంట్ అఫ్ పోలీసు ఆస్మా పర్హీన్ వారికి పేరూ ఊరూ లేని ఈ ఫ్లెక్సీలు తక్షణమే తొలగించాలని కోరుతూ వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటువంటి ఫ్లెక్సీలు వేయించే తీరు చూస్తుంటే వైఎ్సార్సీపీ దిగజారుడు రాజకీయాలకు ఎంత పాల్పడుతుందో అర్థమౌతుందని,అధికారం పోతుందని భయంతో, ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం రోజురోజుకూ సన్నగిల్లుతున్న తరుణంలో వేసిన ఫ్లెక్సీల్లో.. ఎవరూ వేయించారో చెప్పుకోలేక అటు.. ఇటు కాకుండా చులకన రాజకీయాలు చేస్తున్నారని అధికార పార్టీపైన,స్థానిక వైఎ్సార్సీపీ నేతలపై ధ్వజమెత్తారు. జనసేనకు అధికారం లేకపోయినా, ఒక్క ఎమ్మెల్యే లేకపోయినా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిత్యం ప్రజల పక్షాన నిలబడి చేస్తున్న సేవలను చూస్తూ ఓర్వలేక ఇటువంటి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని అన్నారు. ఇటువంటి చర్యలవలన జనసైనుకులకు, పవన్ అభిమానుల మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉన్నందున, ఇటువంటి సమయాల్లో శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత పోలీసులపై ఉంటుందని, తక్షణమే ఈ ఫ్లెక్సీలను తొలగించాలని, లేదంటే జనసేన పార్టీ మనోభావాలను కాపాడుకునేందుకు అధికారపార్టీకి జనసేన తడాఖా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వానికి,జగన్ కు వ్యతిరేకంగా ఎవరైనా సోషల్ మీడియా పోస్టులు పెడితే సి.ఐ.డి కేసులు పెడుతున్నారని…. అదే విధంగా ఇప్పుడు ప్రతిపక్ష నేతలని కించపరిచే విధంగా ప్లెక్సీలు పెట్టిన వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జనసేన నాయకులు ఆదాడ మోహనరావు, ఎంటి రాజేష్, పవన్ కుమార్, బాబు పాల్గొన్నారు.