
మూడోసారి ప్లాస్మాదానం... అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న జనసేన నాయకులు శ్రీ నాగబాబు గారు కోవిడ్ బాధితులకు అండగా మెగాబ్రదర్, జనసేన నాయకులు శ్రీ నాగబాబు తగిన విధంగా స్పందిస్తూ వస్తున్నారు. కోవిడ్ నుంచి కోలుకున్న ఆయన ప్లాస్మా సంజీవిని అందించేందుకు తనవంతు కృషి చేస్తున్నారు. ఈ రోజు కూడా మూడోసారి ఆయన చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌కి వచ్చి ప్లాస్మాదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ''తనది రేర్ గ్రూప్ ఎబి పాజిటివ్'' అని చెప్తూ ఎప్పుడు, ఎవరికైనా అత్యవసర సమయంలో PLATLETS / PLASMA అవసరమైనా తనని సంప్రదించొచ్చు అన్నారు. కరోనా కల్లోలం ప్రపంచ మానవాళినే అస్తవ్యస్తం చేసిందన్నారు. కోలుకోవడానికి వ్యాక్సిన్ అందుబాటులోకి రావడమొక్కటేనన్నారు. అప్పటి వరకూ కరోనా బారిన పడకుండా ముందు జాగ్రత్త చర్యల్ని తీసుకోవాల్సిందేనన్నారు. అందులో భాగంగా ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడం, శానిటైజేషన్ వినియోగించడం, భౌతికదూరం పాటించడం చేయాలన్నారు. కరోనా సెకండ్ వేవ్ వస్తోందన్న సమాచారం కూడా అందుతోందని, ఈ సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. మూడోసారి ప్లాస్మాదానం చేసిన శ్రీ నాగబాబు గారిని సీని అభిమానులు, జనసైనికులు అభినందిస్తున్నారు.