Logo
Date of Publish : 24 November 2020, 3:56 pm
Editor : Sake Naresh

మూడోసారి ప్లాస్మాదానం… అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న జనసేన నాయకులు శ్రీ నాగబాబు గారు

మూడోసారి ప్లాస్మాదానం... అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న జనసేన నాయకులు శ్రీ నాగబాబు గారు                కోవిడ్‌ బాధితులకు అండగా మెగాబ్రదర్‌, జనసేన నాయకులు శ్రీ నాగబాబు తగిన విధంగా స్పందిస్తూ వస్తున్నారు. కోవిడ్‌ నుంచి కోలుకున్న ఆయన ప్లాస్మా సంజీవిని అందించేందుకు తనవంతు కృషి చేస్తున్నారు. ఈ రోజు కూడా మూడోసారి ఆయన చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌కి వచ్చి ప్లాస్మాదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ''తనది రేర్‌ గ్రూప్‌ ఎబి పాజిటివ్‌'' అని చెప్తూ ఎప్పుడు, ఎవరికైనా అత్యవసర సమయంలో PLATLETS / PLASMA అవసరమైనా తనని సంప్రదించొచ్చు అన్నారు. కరోనా కల్లోలం ప్రపంచ మానవాళినే అస్తవ్యస్తం చేసిందన్నారు. కోలుకోవడానికి వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడమొక్కటేనన్నారు. అప్పటి వరకూ కరోనా బారిన పడకుండా ముందు జాగ్రత్త చర్యల్ని తీసుకోవాల్సిందేనన్నారు. అందులో భాగంగా ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించడం, శానిటైజేషన్‌ వినియోగించడం, భౌతికదూరం పాటించడం చేయాలన్నారు. కరోనా సెకండ్‌ వేవ్‌ వస్తోందన్న సమాచారం కూడా అందుతోందని, ఈ సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. మూడోసారి ప్లాస్మాదానం చేసిన శ్రీ నాగబాబు గారిని సీని అభిమానులు, జనసైనికులు అభినందిస్తున్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com