
చిత్తూరు ( జనస్వరం ) : కార్వేటినగరం మండల కేంద్రంలో గంగాధర నెల్లూరు మండలంలోని జనసైనికులు ఇంచార్జ్ యుగంధర్ పొన్నను కలిశారు. ఈ సందర్భంగా Dr యుగంధర్ పొన్న మాట్లాడుతూ వచ్చే రోజుల్లో గ్రామీణ ప్రజలకు అండగా నిలబడేది యువతేనని ఉద్భోదించారు. గ౦గాధర నెల్లూరులో పార్టీని అంతర్గతంగా అభివృద్ధి చేసి, రాజకీయ ప్రక్షాళనకు నాంది పలకాలని యువతను ఉద్దేశించి మాట్లాడారు. ముప్పై రెండు గ్రామ పంచాయతీలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలనీ పిలువునిచ్చారు. ప్రణాళికా బద్దంగా పనిచేయాలని, క్రమశిక్షణతో మెలగాలని తెలిపారు. రాజకీయంలో సహనం ఓర్పు అత్యవసరమని తెలియజేసారు. మండల ప్రజల కోసం, వారి సమస్యల్లో అండగా నిలబడడం కోసం మేము త్యాగం చేయడానికైనా సిద్దమేనని జనసైనికులు తెలపడం గమనార్హం. భవిష్యత్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాత్రమేనని ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా Dr యుగంధర్ పొన్నను దుశ్శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కార్వేటి నగరం మండల అధ్యక్షులు శోభన్ బాబు, ఉపాధ్యక్షులు విజయ్, ప్రధాన కార్యదర్శి వెంకటేష్, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, గంగాధర నెల్లూరు మండల నాయకులు రాజేష్, రాజేష్, దేవా జనసైనికులు అరుణ్, సుధీర్, రఘు, ఉదయ్, రూబన్, అజిత్ కుమార్, తరుణ్, పూర్ణ, అపీల్ కుమార్ ఉన్నారు.