తూర్పు గోదావరి ( జనస్వరం ) : గొల్లప్రోలు పట్టణంలోని స్ధానిక పాపయ్య చావిడి వీధిలో జనసేన పార్టీ ఇంచార్జ్ మాకినీడి శేషు కుమారి చేతులు మీదుగా పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ జనసేన పార్టీ ప్రజలలో భారీ ఆదరణ పొందుతుందని, ప్రజా సమస్యల పట్ల ప్రభుత్వంతో పోరాడుతున్న తమ పార్టీకి ప్రజలు మద్దతు పలుకుతున్నారని హర్షం వ్యక్తం చేశారు. తమ నాయకుడు జనసేనాని పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ప్రజా సమస్యల పోరాటం కోసం తాము నిరంతరం కృషి చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ పరిపాలనలో ధరలు భారీగా పెరిగాయని ప్రజల కనీస అవసరాల కన్నా పార్టీ నేతల ప్రయోజనాలకే రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని ఎద్దేవా చేశారు. అలాగే కార్యకర్తలంతా ఎప్పుడు అందుబాటులో ఉండి సేవాకార్యక్రమాలు కొనసాగించాలని పార్టీ సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ ఆశయాలు ప్రజలకు తెలియజేయాలని సూచించారు. అలాగే మండల కమిటీ నుంచి బూత్ స్థాయి వరకు కమిటీలు వేస్తోందని పార్టీ బలపరిచే విధంగా కార్యాచరణ మొదలు పెడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం జనసేన పార్టీ నాయకులు కీర్తి చంటి, వినుకొండ అమ్మాజీ, అమరాది రామకృష్ణ, పిఠాపురం రూరల్ అధ్యక్షురాలు తోలేటి శిరీష, పట్టా శివ, పుణ్యమంతుల సూర్య నారాయణమూర్తి, అరిపి బ్రదర్స్, పేకేటి బ్రదర్స్, నందపు బ్రదర్, శివ, సింగలూరు రాము, సారధి, కంచె అమరావతి పద్మ, కళ్యాణి, సుధా, వరలక్ష్మి, శ్రీనివాస్, బంగారం, దుర్గ, శిరీష నవీన్, సునీటి శ్రీను, రావుల వీరభద్రరావు, అడబాల వీర్రాజు, దొడ్డి దుర్గాప్రసాద్ వంక కొండబాబు, ఇజ్రాయిల్, మేళం బాబి, గంజి గోవిందరాజు, రాసంశెట్టి కన్యకరావు, యాండ్రపు శ్రీనివాస్, రామిశెట్టి సూరిబాబు, కొండపల్లి శివ, బుర్రా విజయ్, కారపురెడ్డి వెంకటేష్, బెజవాడ శ్రీను, నాయకులు, జనసైనికులు వీర మహిళలు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.