Logo
Date of Publish : 13 October 2020, 3:17 pm
Editor : Sake Naresh

గొల్లప్రోలు ఇబిసి కాలనీని సందర్శించిన పిఠాపురం జనసేన ఇంచార్జ్ మాకినీడి శేషుకుమారి

గొల్లప్రోలు ఇ బి సి కాలనీని సందర్శించిన పిఠాపురం జనసేన ఇంచార్జ్ మాకినీడి శేషుకుమారి

           గొల్లప్రోలులో ఈబిసి కాలనీని పిఠాపురం జనసేన పార్టీ ఇంచార్జి మాకినీడి శేషుకుమారి సందర్శించారు. ఈ సందర్బంగా శేషుకుమారి మాట్లాడుతూ గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షం కారణంగా సుద్ద కాలవ నుండి వస్తున్న నీరు వల్ల ఇబిసి అంతా మునిగి పోయిందని తెలియజేసారు. ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఇబ్బందికరంగా జీవిస్తున్నారని, ఇళ్లలోకి నీళ్లు వచ్చాయని తెలియజేసారు. గత 40 సంవత్సరాలనుండి కూడా ఇదే పరిస్థితి ఉందని పాలకులు వస్తున్నారు పోతున్నారు. కానీ, మాకు పరిష్కారం  చేయలేదని ప్రజలు వాపోయారు అని తెలియజేసారు. గత ప్రభుత్వానికి చిత్త శుద్ధి లేదని ఈ సందర్బంగా తెలియజేసారు. ఇప్పటి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సుద్ద కాల్వను ఆధునీకరణ చేసి గొల్లప్రోలు ఇబిసి కాలనీ వాసులకు పరిష్కారం చూపాలని ఈ సందర్బంగా ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. కష్టం ఉన్నచోట జనసేన ఎప్పుడూ అండగా ఉంటుందని మరోసారి గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మర్రి దొరబాబు, గొల్లపల్లి వీరబాబు, సుబ్బు, రఘు, కార్యకర్తలు జనసైనికులు గ్రామస్తులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com