పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ మాకినీడి శేషుకుమారి గారు యు. కొత్తపల్లి మండలంలో ఉప్పాడ కొత్తపట్నం గ్రామానికి వెళ్లి అక్కడ అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్న ప్రజలతో మాట్లాడడం జరిగింది. ఆ గ్రామస్తులు మాట్లాడుతూ ఏ తుఫాను వచ్చినా సముద్రంలో నీరు ఇళ్లలోకి వస్తుందని తుఫాన్ సమయంలో రాజకీయ నాయకులు వస్తారు చూసి వెళ్లి పోతారు తర్వాత మమ్మల్ని పట్టించుకోరు అని ఆవేదన చెందారు. కనీసం కొన్ని సంవత్సరాల నుంచి నివసిస్తున్నా వాళ్ల ఇళ్లకు పట్టాలు కూడా ఇప్పటికి రాలేదని ఏ నాయకులు వచ్చిన ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఎన్నికల ముందు వచ్చి తెలుసుకుంటారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ల సమస్యలు పట్టించుకోరని గ్రామస్తులు తెలియజేశారు. అంతేకాకుండా ఆ గ్రామం తో పాటు పక్క గ్రామాల్లో కూడా స్మశాన వాటిక లేక రోడ్డు పక్కనే ఉన్న స్థలం నీ స్మశాన వాటిక వాడుకుంటున్నాం అని అన్నారు. కనీసం మాకు ఎటువంటి సమస్యను కూడా తీర్చలేని ఈ విధంగా నాయకులు ఉన్నారని గ్రామస్తులు తెలియపరిచారు. మాకినీడి శేషుకుమారి గారు ఆ సమస్యను త్వరలోనే అధికారుల దృష్టికి తీసుకు వెళ్లి సమస్య పరిష్కారం అయ్యేలా ప్రయత్నం చేద్దాం ఎక్కడ సమస్య ఉంటే అక్కడ జనసేన ఉంటుంది అలాగే నియోజవర్గం లో ఎక్కడ సమస్య ఉన్నా ముందు మీ ఆడపడుచులా పని చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శివ, దొడ్డి దుర్గాప్రసాద్, తోలేటి శిరీష, mptc అభ్యర్థి నాగ గౌరీ లక్ష్మి, అమ్మాజీ, మణికంఠ, బొలిశెట్టి వెంకటలక్ష్మి, సూరడా శ్రీను, జోతుల సందీప్, సురేంద్ర, దుర్గ, ప్రసాద్ తదితర జనసైనికులు, జనసేన నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు.