
ఈరోజు పిఠాపురం పార్టీ ఆఫీస్ లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి జనసేనపార్టీలో చేరిన పిఠాపురం మండలం మల్లం గ్రామం అంబేద్కర్ నగర్ నాయకులు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన జనసేనపార్టీతోనే బడుగు బలహీనవర్గాల అభివృద్ధి సాధ్యమని నమ్మి పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి గారి సమర్థవంతమైన నాయకత్వానికి ఆకర్షితులై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వీడిన పాట్టి రాంబాబు, బoడా జయ బాబు, రండా వీరబబాబు, కట్టగపూడి అశోక్, కలిసి జనసేన పార్టీలో చేరారు. వీరికి పిఠాపురం జనసేన ఇంచార్జ్ మాకినీడి శేషుకుమారి గారు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో 40 మంది అంబేద్కర్ నగర్ నాయకులు పార్టీ లో చేరారు.. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మల్లం ఎంపిటిసి అభ్యర్థి1 రాసంశెట్టి కన్యక రావు, యండ్రపు శ్రీనివాస్, మర్రి దొరబాబు కోలా ప్రసాద్ y. చక్రధర్ మల్లం జన సైనికులు తదితరులు పాల్గొన్నారు.