పిఠాపురం, (జనస్వరం) : తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం నియోజవర్గం గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామంలో మిర్చి రైతుల యొక్క సమస్యలను పిఠాపురం నియోజక వర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి, జిల్లా అధ్యక్షులు శ్రీ కందుల దుర్గేష్ దృష్టికి తీసుకొని వెళ్లడంతో వారి ఆదేశానుసారం దుర్గాడ గ్రామంలో జనసేన నాయకులు పర్యటించడం జరిగింది. వైరస్ తెగులు కారణంగా పచ్చి మిరప (మిర్చి) పంటలు వల్ల తీవ్రంగా నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలని పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ జిల్లా కార్యదర్శులు, మండల అధ్యక్షులు, నాయకులు, జనసైనికులు డిమాండ్ చేశారు. గురువారం గొల్లప్రోలు మండలంలోని దుర్గాడ గ్రామాల్లో వైరస్ తెగులు దెబ్బతిన్న పచ్చి మిర్చి, ఉల్లి మరియు కొబ్బరి తదితర పంటలను తూర్పుగోదావరి జనసేన పార్టీ కార్యదర్శులు మొగిలి అప్పారావు, బండి ఏసుబాబు, చీకట్ల శ్యాం కుమార్ మరియు పిఠాపురం నియోజవర్గం జనసేన నాయకులు వూట నాని బాబు, తెలగంశెట్టి వెంకటేశ్వరరావు వెన్న జగదీష్ గొల్లప్రోలు మండల అధ్యక్షుడు అమరాది వల్లి రామకృష్ణ, దుర్గడా గ్రామ జనసేన నాయకులు ఇంటి వీరబాబు, రావుల వీరభద్రరావు మొగిలి శ్రీను, కోప్పన శివ, పెనుగొండ వెంకటేశ్వరరావు మరియు నియోజకవర్గ జనసేన నాయకులు జనసైనికులు పలువురు రైతులతో కలిసి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి పంటలు సాగు చేశారని, తీర చేతికందే సమయంలో వైరస్ తెగులు కారణంగా పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. సుమారు 800ఎకరాలులో మిర్చి తోటలో రసం పీల్చే పురుగులు (పేనుబంక )వలన పై ముడత మరియు మొత్తం పూత పిందు మొత్తం రాలిపోతున్నాయి. దీనితో రైతులకు 1 ఎకరానికి 1 లక్ష వరకు పెట్టుబడి నష్టం వచ్చింది. రైతులకు 2లక్షలు నుండి 3 లక్షలు వరకు ఆదాయం పోయింది. కాబట్టి దీన్ని విపత్తుగా భావించి నష్ట పరిహారం రైతులకు ఇవ్వాలి అని జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది. పచ్చి మిర్చి పంటలు నష్టపోయిన రైతులకు పంట ఖర్చుల అంచనా ప్రకారం నష్టపరిహారం చెల్లించాలన్నారు. అలాగే పంటల బీమా పథకం కింద వెంటనే రైతులకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలన్నారు. ప్రభుత్వము నష్టపరిహారంపై ప్రకటన చేయాలని వారు డిమాండ్ చేశారు. పంట నష్టం అంచనాలను వెంటనే వ్యవసాయ అధికారులు తయారుచేసి రైతుల నష్టపరిహార జాబితాలను ఉన్నతాధికారులకు పంపాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వము రైతులకు ఇచ్చిన హామీలను అన్నిటిని నెరవేర్చాలని వారు కోరారు. వీరి వెంట దుర్గాడ గ్రామానికి చెందిన పలువురు రైతులు ఆకుల నాగేశ్వరావు, కొరకుప్ప సత్యనారాయణ, ఆకుల నాగయ్య, ఇంటి శ్రీను, నాగళ్ళ అప్పారావు, బుర్ర అప్పన్న, రావుల క్రిష్ణ వారి పంట నష్టం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శులు మొగిలి అప్పారావు, బండి ఏసుబాబు, చీకట్ల శ్యామ్ కుమార్, గొల్లప్రోలు మండల అధ్యక్షులు అమరది వల్లి రామకృష్ణ, జనసేన నాయకులు తెలగశెట్టి వెంకటేశ్వరరావు, వెన్న జగదీష్, జడ్పిటిసి అభ్యర్థి వూట ఆదివిష్ణు, ఇంటి వీరబాబు, రాగుల వీరభద్రరావు, మొగలి శ్రీనివాస్, కొప్పున రమేష్, బొజ్జ శ్రీను, గంజి గోవిందరాజు వాకాపల్లి సూర్యప్రకాష్, విరవాడ ఎంపిటిసి అభ్యర్థి రామిశెట్టి సూరి బాబు, కీర్తి చంటి, సర్నీడి శ్రీను, యండ్రపు శ్రీనివాసు, మేళం బాబి, వినుకొండ అమ్మాజీ, సి.హెచ్ శిరీష, బెల్లంకొండ రవి, మైనం నాగేశ్వరరావు, చీకోలు రాజశేఖర్, తోట సతీష్, నామ శ్రీకాంత్, సి.హెచ్ సతీష్, దుర్గాడ జనసైనికులు, నాయకులు రైతన్నలు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com