Logo
Date of Publish : 27 November 2021, 4:46 pm
Editor : Sake Naresh

కార్తీక వన సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నజనసేనపార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ మాకినీడి శేషుకుమారి

      పిఠాపురం, (జనస్వరం) : తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో చేబ్రోలు నాయకులు, జనసైనికులు అతి భారీ కార్తీక వన సమారాధన కార్యక్రమం ఆ పార్వతీ పరమేశ్వరుల దీవెనలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ ముఖ్య అతిధులుగా తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్, పీఏసీ సభ్యులు పంతం నానాజీ, పిఠాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి మరియు ప్రత్యేక ఆహ్వానితులుగా శ్రీ ముత్తా శశిధర్ కాకినాడ టౌన్ జనసేన పార్టీ ఇంఛార్జ్, శ్రీ తుమ్మల బాబు పెద్దాపురం నియోజకవర్గ ఇంఛార్జ్, శ్రీ పాఠం శెట్టి సూర్యచంద్ర జగ్గంపేట నియోజకవర్గ జనసేన ఇంఛార్జ్, శ్రీ వరుపుల తమ్మయ్య బాబు ప్రత్తిపాడు నియోజకవర్గం, రామచంద్రపురం ఇంఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్, జిల్లా కార్యవర్గ సభ్యులు ఈ రోజు జరిగిన భారీ వన సమారాధన కార్యక్రమంలో ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్నారు. ఈ వన సమారాధన కార్యక్రమం గొల్లప్రోలు మండలం వెలుగు బంధ చేబ్రోలు గ్రామంలో జరిగినది. ఈ కార్యక్రమంలో ప్రముఖ పాత్ర నిర్వహించిన ప్రముఖ జనసైనికులు నాయకులు ఓరుగంటి పెద్దకాపు, దమ్ము చిన్న, యాదాల ముత్తా రావు, ఆకుల శీను, పడాల సురేష్, పెద్దింటి శివ, ఖండవిల్లి మణికుమార్, ఎలుగుబంటి దొరబాబు, చేబ్రోలు జనసైనికులు. ఈ కార్యక్రమానికి పిఠాపురం రూరల్ మండలం, గొల్లప్రోలు మండలం, కొత్తపల్లి మండలం,పిఠాపురం టౌన్, గొల్లప్రోలు టౌన్ నుండి జనసేన నాయకులు కార్యకర్తలు, జనసైనికులు వీర మహిళలు భారీ సంఖ్యలో శేషుకుమారి వెంట ర్యాలీగా వెళ్లి ఈ కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని జయప్రదం చెయ్యడం జరిగింది. ఈ సందర్భంగా చేబ్రోలు జనసైనికులు నాయకులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com