లింగాల మునేటి మీద పైప్ లైన్ లను మరమ్మత్తులు చెయ్యాలి : జనసేన వెంకట రామయ్య
వత్సవాయి మండలం లింగాల గ్రామం మునేటి వంతెనను మరియు వంతెన మీద పగిలిపోయిన మంచి నీళ్ళ పైపులైన్లను జనసేన పార్టీ నాయకులు సందర్శించి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ వత్సవాయి మండల నాయకులు రేగండ్ల వెంకట రామయ్య మాట్లాడుతూ మాట్లాడుతూ ఎగువ ప్రాంతాన కురుస్తున్న కొద్దిపాటి వర్షాలకు కూడా లింగాల మునేటి వంతెన దిగువగా ఉండటం వలన వంతెన మీదకు నీరు ప్రవహిస్తుండటం తో వంతెన గుండా వెళ్తున్న నీళ్ల పైపులు దెబ్బతినడంతో మండలం లోని వత్సవాయి, లింగాల, చిట్టేలా, సింగారాం, మక్కపేట, బీమవరం, గంగవల్లి పోచారం, వేములవర్వ, ఇలా పలు గ్రామాల ప్రజలకు మంచినీటి కొరత ఏర్పడటం వలన ప్రజలు మంచినీళ్ల సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు ఇలా నెల రోజుల కాలం నుండి మంచినీరు అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని అంతేకాకుండా ఇది కరోనా సమయం కావున పక్క ఇళ్లల్లో ఉంటున్న వారిని కూడా గుక్కెడు మంచినీళ్లు అడిగే పరిస్థితి కూడా లేకపోవడంతో ఆ గ్రామాల ప్రజలు మంచినీరు దొరకక అల్లాడిపోతున్నారు కావున తక్షణమే అధికారులు స్పందించి త్వరతిగతిన పైప్లైన్ లు బిగించి మండలంలోని మంచినీటి కొరత ఏర్పడిన గ్రామాలన్నిటికి నీరు అందించాలని అదేవిధంగా మునేటి వంతెనను కూడా ఎత్తుగా నిర్మించాలని వెంకట రామయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నండ్రు రాము, అంబాజి గోపి, భూషణం, ఉపేంద్ర, రాంబాబు, చెన్న నాగరాజు తదితరులు పాల్గొన్నారు.