Logo
Date of Publish : 02 August 2022, 3:42 pm
Editor : Sake Naresh

రాజంపేటలో పింగళి వెంకయ్య జయంతి వేడుకలు

          రాజంపేట ( జనస్వరం ) : భారత స్వాతంత్ర సమరయోధుడు ,మన జాతీయ జెండా రూపకర్త కీర్తిశేషులు శ్రీ పింగళి వెంకయ్య గారి 146 వ జయంతి సందర్భంగా ఈ రోజు రాయచోటి జనసేనపార్టీ కార్యాలయంలో జనసేన నాయకులు,  షైక్ రియాజ్ నేతృత్వంలో ఆయన చిత్రపటానికి పూలు వేసి  నివాళులు అర్పించారు. భారత దేశంలో ప్రతిఒక్కరూ ఆయన చేసిన సేవల పట్ల గుర్తెరగాలని పేర్కొన్నారు. అదేవిధంగా జనసేనపార్టీ నాయకులు రామశ్రీనివాస్ మాట్లాడుతూ "స్వాతంత్ర్య సమరయోధులు, సాహితీవేత్త, బహుభాషా కోవిదులు, భారత జాతీయ పతాకానికి రూపకల్పన చేసి మన తెలుగువారి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన ఆయన చివరికి తినడానికి ఆహారం లేకుండా చాలా రకాల సమస్యలు ఎదుర్కొని తుది శ్వాస విడిచారు. అటువంటి పరిస్థితి ఏ ఒక్కరికి కూడా రాబోయే తరాల వారికి పునరావృతం కాకుండా అందరూ భావితరాల భవిష్యత్తు దేశం, సమాజం కోసం ఎంతో మంది మహనీయులు చేసిన సేవలు త్యాగాలను గుర్తు చేసుకొవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని కొనియాడుతూ శ్రీ పింగళి వెంకయ్య గారి జయంతి సందర్భంగా వారి సేవలను స్మరించుకుంటూ వారికి ఘననివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మౌలానా రషీద్ అహ్మద్ ఖాసిమ్, అరిఫ్, షాహిద్, వెంకటేష్, సుబ్బయ్య, హైదర్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com