గంగాధర నెల్లూరు, (జనస్వరం) : గంగాధర నెల్లూరు నియోజకవర్గం, SR పురం మండలములో జనసేన నాయకులు యుగంధర్ పొన్న ఆధ్వర్యంలో చేపట్టిన నా సేన కోసం నా వంతు కార్యక్రమంలో భాగంగా గ్రామ సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పొన్న మాట్లాడుతూ పిల్లారి కుప్పం దళిత వాసులకు ఇబ్బందులు లేని స్మశాన వాటికను నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే దళిత గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలును పట్టించుకోరా? ఏళ్ల తరబడి ఇలా ఎందుకు జరుగుతోంది? అవి గ్రామాలు కావా? అక్కడి వాళ్ళు మనుషులు కారా? వర్ణ వివక్షత ఏమైనా చూపిస్తున్నారా? అని మండిపడ్డారు. మండల తహసీల్దార్ వెంటనే స్పందించి స్మశాన వాటికను సర్వే చేసి, హద్దులు చూపించి పిల్లారి కుప్పం గ్రామ ప్రజలకు ఉన్న ఇబ్బందులను తొలగించాలని జనసేనపార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామని లేదంటే మండల కేంద్రంలో జనసేన ఆధ్వర్యంలో మహా ధర్నా చేస్తాము అని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసైనికులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com