కొంచం ఆట – కొంచం మాట వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టిన జనసేన నాయకులు పీలా రామకృష్ణ
విశాఖ పశ్చిమ నియోజకవర్గం జనసేన ఇంఛార్జి పీలా రామకృష్ణ గారు వినూత్న కార్యక్రమం చేపట్టారు. జనసేన పార్టీని నియోజకవర్గంలో బలోపేతం చేసే దిశగా, యువతను ఒక చోట చేర్చి కొంచం ఆట – కొంచం మాట అదే మన క్షేత్ర స్థాయి పార్టీ నిర్మాణానికి పునాది బాట. అనే కార్యక్రమంను నిన్న విశాఖ పారిశ్రామిక ప్రాంతంలో శ్రీకారం చుట్టారు. తొలి విడత గా 4వార్డ్ లో నిర్వహించిన ప్రోగ్రాం చాలా అద్భుతంగా గా జరిగింది. ప్రతి వార్డ్ లొ ఎంత మంది యువత ఉన్నారు. అందులో ఎంత మంది చదువుకున్నారు, ఎంత మంది ఉద్యోగాలు చేస్తున్నారు, ఎంత మంది నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎంటి అనే అంశాలతో ఈ కార్యక్రమంను నిర్వహించారు. ఇందులో ఎంత మందికి ఓటు హక్కు ఉంది, లేనివారికి అప్లై చేయడం, మన పార్టీ యొక్క సిద్ధాంతాలను, జనసేనకి మద్దతుగా మారడానికి ప్రభావితం చేయడం కోసం ఈ కార్యక్రమంను శ్రీకారం చుట్టారు. అనంతరం ప్రతి వార్డ్ లో పార్టీని బలోపేతం చేసే దిశగా గా ముందు కి అడుగులు వేస్తున్నారు పీలా రామకృష్ణ గారు మరియు జనసైనికులు. ఈ వినూత్న శ్రీకారానికి జనసైనికులు, జనసేన నాయకులు అభినందిస్తున్నారు.