Logo
Date of Publish : 13 March 2026, 6:21 pm
Editor : Sake Naresh

సుద్దుల సుధకు పిహెచ్డీ డాక్టరేట్ ప్రదానం

ఎస్కేయూ, అనంతపురము, మార్చి 13, (జనస్వరం) : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం గ్రామీణాభివృద్ధి విభాగంలో పరిశోధనలు చేసినందుకు గాను సుద్దుల సుధకు పిహెచ్‌డీ డాక్టరేట్ ప్రదానం చేశారు. గ్రామీణాభివృద్ధి, సామాజిక కృషి విభాగం అధ్యక్షులు, పాఠ్య ప్రణాళికా సంఘం అధ్యక్షులు ఆచార్య ఎం. మునినారాయణప్ప పర్యవేక్షణలో ఆమె “అనంతపురం జిల్లాలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో దివ్యాంగుల భాగస్వామ్యం” అనే అంశంపై పరిశోధనలు చేశారు. ఈ అంశంపై ఆమె చేసిన పరిశోధనలు గ్రామీణ ప్రాంతాల్లో దివ్యాంగుల ఉపాధి అవకాశాలపై ప్రత్యేక దృష్టి సారించాయి. ఇదే విషయం గురించి పలు జాతీయ, అంతర్జాతీయ సదస్సులు, జర్నల్స్‌లో పరిశోధనా వ్యాసాలు వెలువరించారు. ఆమె పరిశోధనలకు గాను శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం గ్రామీణాభివృద్ధి విభాగం పీహెచ్‌డీ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. ఈ సందర్భంగా విభాగానికి చెందిన ఆచార్యులు, అధ్యాపకులు, పరిశోధకులు సుద్దుల సుధను అభినందించారు. ఆమె చేసిన పరిశోధనలు భవిష్యత్తులో గ్రామీణాభివృద్ధి విధానాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో దివ్యాంగుల సంక్షేమం, ఉపాధి అవకాశాల విస్తరణకు ఈ అధ్యయనం ఉపయోగపడుతుందని విశ్వవిద్యాలయ వర్గాలు తెలిపారు. కుటుంబ సభ్యులు, మిత్రులు, సహ పరిశోధకులు సుద్దుల సుధకు శుభాకాంక్షలు తెలియజేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com