Search
Close this search box.
Search
Close this search box.

చుక్కల భూమి పరిష్కారం జీవో నెంబర్ 163 విషయంపై కలెక్టర్ కు వినతి

చుక్కల భూమి

   నెల్లూరు ( జనస్వరం ) : చుక్కల భూమి పరిష్కారం జీవో నెంబర్ 163….విషయం పై కలెక్టర్ గారికి జనసేన పార్టీ తరఫున జనసేన నాయకులు వినతి అందించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ తరఫున నాయకులు మాట్లాడుతూ ఈ వైసీపీ ప్రభుత్వం చెప్పేది కొండంత చేసేది గోరంత అంటే పని తక్కువ మాటలు ఎక్కువ. రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల ఎకరాలు ఉన్న చుక్కల భూమిని తాము మొత్తం ఉద్ధరిస్తున్నట్టు, చుక్కల భూముల రైతుల కష్టాలు తనకు మెత్తం తెలిసినట్లు ప్రగల్బాలు సీఎం పలికారు. రాష్ట్రం జిల్లాలో ఉన్న చుక్కల భూములు 72112.46 ఎకరాల్లో జీవోను అనుసరించి 43270 భూములను చుక్కల భూములను ప్రభుత్వ నిషేధిత జాబితా నుంచి తొలగించామని చెప్పి (అంటే 60%) క్షేత్రస్థాయిలో రికార్డులు పరిశీలించగా కేవలం 112 సర్వే నెంబర్ల భూములు మాత్రమే అంటే దాదాపు 25 వేల(25వ శాతం లోపల) ఎకరాలు మాత్రమే లోపల తొలగించింది. ఈ విషయమై గత నాలుగు సంవత్సరాలుగా జనసేన పార్టీ ఆత్మకూరు ఇన్చార్జ్ నళిశెట్టి శ్రీధర్ గారి ఆధ్వర్యంలో కొన్ని రోజులు నిరాహారదీక్ష జరిగింది,రాస్తారోకోలు ఆందోళనలు చేపట్టారు. ప్రభుత్వం చుక్కల భూముల రైతులకు న్యాయం జరగలేదు. రానున్న రోజుల్లో తమకి కావాల్సిన కొన్ని సర్వేల ప్రకారం కాకుండా అందరికీ న్యాయం జరిగేలా జనసేన పార్టీ తరఫున పోరాడుతాం
 ఇకపోతే కోట్ల రూపాయల ప్రజాధనం,సమయం వృధా చేస్తూ బటన్ నొక్కడానికి ప్రతి నెలలో సమావేశం అయ్యే సీఎం జగన్ గారు చిన్నప్పుడు ఇళ్ళా నారాయణమ్మ అని ఒక సామెత ఉండేది. ఆవిడకు ఊర్లో ఉన్న వారంతా ఏం చేస్తున్నారో ఎవరితో మాట్లాడుతున్నారో ఎవరెవరితో సంబంధం అంటగడతామో అనే పరిస్థితి తప్పిస్తే తన సొంత ఇంటి విషయమై చూసుకునే పరిస్థితి ఉండదు. బహిరంగ సభలో ప్రజలందరూ గమనిస్తుండగా బాధ్యతాయుతమైన పదవిలో ఉండి సంబంధాలు అంట కట్టడం,పెళ్లిళ్లు పెటాకులు గురించి మాట్లాడడం హేయమైన చర్య. మీరు నిజంగా వాటి గురించి మాట్లాడాల్సి ఉంటే మా ప్రముఖులు ఉన్నారు వాళ్ళ సమక్షంలో మీ ఇంట్లో జరిగిన ఇట్లాంటి కార్యక్రమాల చర్చించుకోవచ్చు. కేవలం జనసేన పార్టీ అంటే భయంతోనే ఏదో ఒక బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు.ఎలాగూ ఎలక్షన్ కమిషన్ ఎవరో స్థాపించిన పార్టీకి మీరు శాశ్వత అధ్యక్షులుగా ఉండడానిని నిషేధించింది కాబట్టి వైసిపి పార్టీని ఇళ్ళా నారాయణమ్మ అనే పార్టీని రిజిస్టర్ చేసుకొని దాంతో నడిపిస్తే మంచిది అనేది నా అభిప్రాయం. ఈ ఒక్క విషయంలోనే కాదు వైసిపి ప్రభుత్వం వాగ్దానాలు చేసిన మద్యపానం అమలులో అయితే ఏమి ఉద్యోగాల రూపకల్పన లాటి విషయాల్లో వారు చెప్పింది ఒకటి చేసేదిఒకటి . ఈ సందర్భంగా పనిచేయని వైసీపీ ప్రభుత్వాన్ని పారదోలాల్సిందిగా నేను జనసేన పార్టీ తరఫున పిలుపునిస్తున్నాను. ప్రజల సమస్య సాధికారత పై అవగాహన ఉన్న అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి ప్రజా ప్రభుత్వం జనసేన పార్టీ ప్రభుత్వం స్థాపించాల్సిన ఆవశ్యకత ఉంది. ఇక నెల్లూరు విషయానికొస్తే వైసీపీ నాయకులు వేళ్లు తిప్పుతూ నేను తలుచుకుంటే నువ్వు ఉండవంటారు,మరొకరు చీరేస్తామంటారు మరి కొందరు బూతులు మాట్లాడుతూ మీడియా లో బహిరంగంగా మాట్లాడడం తో జిల్లాలో సామాన్య ప్రజలు భయాందోళన గురి అవుతున్నారు. లా అండ్ ఆర్డర్ చూడవలసిన అధికారులు ఏం చేస్తున్నారనేది అర్థం కావడం లేదు. ఇటువంటి వారిని మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం లేదు ప్రజలందరూ కూడా తమ సమస్యల పరిష్కారం చేయగల ప్రత్యాన్యాయ నాయకులను ఎన్నువాల్సిన పరిస్థితులు ఉందని కూడా తెలియజేశారు. ఆత్మకూరు నియోజకవర్గం ఇన్చార్జి నలిశెట్టి శ్రీథర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్,సిటీ నాయకులు కేతం రెడ్డి వినోద్ రెడ్డి,సూళ్లూరుపేట ఇన్చార్జి ఉయ్యాల ప్రవీణ్, సర్వేపల్లి నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, జిల్లా అధికార ప్రతినిధి కారంపూడి కృష్ణారెడ్డి, జిల్లా నాయకులు రవికుమార్, హరి రెడ్డి, కావలి నాయకుడు వెంకటరమణ, ప్రశాంత్ గౌడ్, హేమచంద్ర యాదవ్, అమీన్, షాజహాన్, షాజహాన్, మౌనేష్, బన్నీ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం
WhatsApp Image 2024-10-14 at 5.45
కందుకూరులో ఘనంగా పల్లె పండుగ వారోత్సవాలు
IMG-20240918-WA0003
కందుకూరులో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way