టెక్కలి ( జనస్వరం ) : సరియాపల్లి గ్రామపంచాయతీలో కొత్తగా పెడుతున్న మద్యం దుకాణాలను నిషేధించాలని సరియాపల్లి గ్రామ౦లో ఎటువంటి మద్యం దుకాణలు ఉండకూడదని గ్రామ ప్రజలు తరుపున సబ్ కలెక్టర్ గారికి పిల్లల చందు గ్రామ ప్రజలు పెద్దలు సర్పంచ్ గారి సంతకాలుతో ఫిర్యాదు ఇచ్చారు. రావివలస గ్రామపంచాయతీ లో గల శ్రీశ్రీశ్రీ ఎండల మల్లిఖార్జునస్వామి ఆలయంలో భక్తులకు ఎండోమెంట్ నియమనిబంధనలు ప్రకారం ఉచిత దర్శన సౌకర్యం కల్పించాలిని , శుక్రవారం టెక్కలి సబ్ కలెక్టర్ కు జనసేన నాయకులు అనపాన జనార్ధన్ రెడ్డి, ముడిదాన పూర్ణచంద్ర, పిల్లల చందు తదితరులు వినతిపత్రం అందించారు. ఆలయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు, మౌలిక సదుపాయాలు, ప్రైవేట్ వ్యక్తులతో ప్రసాదాలు విక్రయం, విరాళాలు బహిరంగ బోర్డు ఏర్పాటు, పెంచిన టికెట్ ధరల తగ్గింపుపై చర్యలు తీసుకోవాలని కోరారు.