ఆత్మకూరు ( జనస్వరం ) : ఆత్మకూరు మున్సిపల్ పరిధిలో వైఎస్ఆర్సిపి పార్టీ వారు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని కించపరిచే విధంగా ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలను తొలగించాలంటూ ధర్నా చేశారు. ఆత్మకూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ నాయకులు మరియు జనసైనికులు కలిసి ఆత్మకూరు బస్టాండ్ లోని జనసేన పార్టీ ఆఫీస్ నుండి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్చార్జ్ నలిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ వైఎస్ఆర్ పార్టీ వారు వేసిన ఫ్లెక్సీల్లో పవన్ కళ్యాణ్ గారిని కించపరిచే విధంగా చూపడం అత్యంత హేయమైన చర్యగా పేర్కొన్నారు. వైయస్సార్సీపి వారు ఫ్లెక్సీలలో వేసిన విధంగా రాబోయే ఎన్నికలు పేదలకు పెత్తందారులకు మధ్య జరిగే యుద్ధమో లేక సామాన్య ప్రజానీకానికి రాక్షస పాలనకు మధ్య జరిగే యుద్ధమో రాబోయే ఎన్నికల్లో ప్రజలే తెలియచేస్తారని అంతవరకు ఓపిక పట్టాలని తెలిపారు. అధికారంలో ఉన్న పార్టీ రాష్ట్రానికి తాము చేసిన మంచిని చెప్పుకొని ఓట్లు అడగడం రాజకీయ పార్టీల ఆనవాయితీ. లేదా గతంలో అధికారంలోకి రాకముందు తాము ఇచ్చిన హామీలను ఏ విధంగా అమలు చేసామో తెలుపుకొని, మళ్లీ తిరిగి మమ్మల్ని అధికారంలోకి తీసుకొని వస్తే ఇప్పుడు ఇవ్వబోయే హామీలను అమలు చేస్తామని చెప్పడం కూడా ఆనవాయితీ. కానీ ఈ రెండు విషయములలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని శ్రీధర్ తెలిపారు. ఈ నాలుగేళ్ల పాలనలో లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని దివాలా అంచున వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని నిలిపిందని తెలిపారు. ఎంతగా దివాలా తీసిందో చెప్పేందుకు స్పష్టమైన ఉదాహరణగా ప్రతినెల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేక ఆర్థిక శాఖ మంత్రి, అప్పుల శాఖ మంత్రిగా మారి కేంద్ర ప్రభుత్వ పెద్దల చుట్టూ తిరగడం రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక దివాలా తనానికి నిదర్శనం. తెచ్చిన లక్షల కోట్ల రూపాయల అప్పులతో రాష్ట్రానికి ఉత్పత్తి రంగంలో పెట్టుబడులు పెట్టి రాష్ట్ర అభివృద్ధికి తద్వారా యువత యొక్క ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పనకు తోడ్పడ్డారా అంటే అదీ లేదు. రాష్ట్రానికి జీవనాడియైన పోలవరం ప్రాజెక్ట్ గత ప్రభుత్వ హయాంలో 70% పైగా పనులు పూర్తయ్యాయని కేంద్ర జల వనరుల శాఖ మంత్రి తెలపడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన నాలుగు సంవత్సరాల కాలంలో కేవలం 4 శాతం పనులు మాత్రమే జరిగాయి అంటే వ్యవసాయ రంగం మరియు సాగునీటి రంగం పైన ఈ ప్రభుత్వ యొక్క చిత్తశుద్ధి ఏపాటిదో అర్థమవుతుంది. ఈ ప్రభుత్వం సాగునీటి రంగంలో ఎంతో నిర్లక్ష్యంగా వ్యవహరించింది.ఈ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టుల నిర్వహణ ఖర్చులను కూడా విడుదల చేయని కారణంగా పులిచింతల గేట్లు కొట్టుకొని పోవడం, పించా మరియు అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడం, వేలాది ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవించడం మనకందరికీ తెలిసిందే. దెబ్బతిన్న సోమశిల ప్రాజెక్టు ముందు బాగాన ఉన్న ఆఫ్రాను మరియు కరకట్టలను యుద్ధ ప్రాతిపదికన రిపేరు చేయవలసి ఉన్నప్పటికీ,గత మూడు సంవత్సరాలుగా అందుకు అవసరమైన నిధులను విడుదల చేయని కారణంగా,సోమశిల ప్రాజెక్టు ప్రమాదపు అంచులలో ఉండడం మనకు అందరికీ తెలిసిందే. పరిశ్రమలను ప్రోత్సహించి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించవలసిన ప్రభుత్వం కేవలం కక్షగట్టి అమరాన్ వంటి దిగ్గజ సంస్థలను తెలంగాణ కు తరిమి వేయడం ద్వారా యువత ఉద్యోగ ఉపాధి అవకాశాల పట్ల ఈ ప్రభుత్వము యొక్క చిత్తశుద్ధి ఏర్పాటుతో మనకు అర్థమవుతుంది. కనీసం గత ప్రభుత్వంలో వేసిన రోడ్లకు పడ్డ గుంటలు కూడా పూడ్చలేని స్థితిలో ప్రభుత్వ ఉండడం ఎంతో శోచనీయం. ఈ విధంగా ఈ రంగం ఆ రంగం అని కాకుండా అన్ని రంగాల్లో ఈ ప్రభుత్వం విఫలమైన విషయం ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. ఇక గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ పార్టీ ఇచ్చిన హామీల్లో ఒకటి కూడా అమలు చేయలేని స్థితిలో ప్రభుత్వ ఉంది. మచ్చుకు ఉదాహరణగా కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్న పెద్దలు, కేంద్రం ముందే మెడలు ఉంచి మోకరిల్లవలసిన పరిస్థితి ఎందుకు వచ్చిందో చెప్పాలి. తమపై ఉన్న ఈ.డి మరియు సి.బి.ఐ కేసుల నుండి అరెస్టు విషయంలో వెసులుబాటు పొందేందుకే ప్రత్యేక హోదాను అడగలేక ఈ ప్రభుత్వం చేతులెత్తేసిందని ప్రజలు భావిస్తున్నారు. సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానన్న పార్టీ పెద్దలు ఈరోజు దేశంలో ఎక్కడా లేని నాసిరకం మద్యంతో ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి తమ జోబులు నింపుకుంటున్న విషయాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు. అదేవిధంగా అమరావతి రాజధాని విషయంలో, ప్రభుత్వ ఉద్యోగుల సిబిఎస్ రద్దు చేస్తానన్న విషయంలో ప్రభుత్వం యొక్క మోసపూరిత, కక్షపూరిత విధానాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. కచ్చితంగా రాబోయే ఎన్నికలు సామాన్య ప్రజలకు రాక్షసపాలనకు మధ్య జరిగే యుద్ధంగా ప్రజలు భావిస్తున్నారని గుర్తుంచుకోవాలి. కచ్చితంగా రాబోయే ఎన్నికల్లో వైయస్సార్సీపి ప్రభుత్వాన్ని సాగనంపే విధంగా ప్రజలు తమ తీర్పును ఇవ్వనున్నారని తెలిపారు. ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ గారికి విజ్ఞప్తి చేస్తూ తక్షణమే పవన్ కళ్యాణ్ గారిని కించపరిచే విధంగా ఉన్న ఫ్లెక్సీలను తొలగించాలని లేనిపక్షంలో ఇటువంటి ఫ్లెక్సీలు ఉండడం ప్రభుత్వ అధికారులకు సమ్మతమేనని భావిస్తూ మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారు పన్నులు,ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా మొదలగు రూపాల్లో ప్రజలను రాక్షసంగా ఫీడించే చిత్రాలను ఫ్లెక్సీ ల రూపంలో ఇప్పుడు ఉన్న ఫ్లెక్సీలు పక్కనే ఏర్పాటు చేస్తామని తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం లోని మండల స్థాయి నాయకులు మరియు జన సైనికులు పాల్గొన్నారు.