Logo
Date of Publish : 18 May 2023, 2:33 pm
Editor : Sake Naresh

లుంబూరు గ్రామ ప్రధాన సమస్యలపై MPDO కి వినతి పత్రం

     పాలకొండ ( జనస్వరం ) : పాలకొండ మండలం స్థానిక పాలకొండ లుంబూరు మధ్య గల రోడ్డు మరమ్మతులు చేపట్టాలని ఎంపిడిఓ డొంక త్రినాధులకు పాలకొండ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు గర్భాన సత్తిబాబు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా గర్భాన సత్తిబాబు మాట్లాడుతూ.. లుంబూరూ గ్రామంలో BC కాలనీలో రోడ్డు లేదని, కలువాలు లేకపోవడం వల్ల, నీరు నిల్వలు అధికంగా ఉండడం వలన, దోమలు వ్యాపించడం జరుగుతోందన్నారు. అక్కడ నివసించే ప్రజలు దోమకాటుకు గురై, డెంగ్యూ, మలేరియా వంటి, వివిధ రకాల వ్యాధులు వ్యాపిస్తుండటంతో అక్కడి ప్రజలు ఆందోళనకు గురవుతున్నారని గర్భాన సత్తిబాబు తెలియపరిచారు. వివరణ అనంతరం ఎంపీడీవో గారు స్పందించి, తక్షణమే చర్యలు తీసుకుంటామని తెలిపారు. పనులు వేగవంతం చేసేందుకు ఆదేశాలు జారీ చేస్తామని, లుంబూరు బీసీ కాలనీ CC రోడ్డు కి నిధులు కేటాయిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసైనికులు సతివాడ వెంకటరమణ, గర్భాపు నరేంద్ర, డొంపాక సాయి కుమార్, మాదసి సంతోష్ కుమార్, రమేష్ పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com