రాజంపేట ( జనస్వరం ) : అన్నమయ్య జిల్లా కలెక్టర్ పి యస్ గిరీష కు స్పందనలో వినతి పత్రాన్ని అందజేసిన జనసేనపార్టీ నాయకులు రామ శ్రీనివాస్. రాయచోటి నుండి సుండుపల్లి వయా రాయవరం, పింఛ వరకు రెండు వరసల రహదారి పనులు త్వరతీగతిన పూర్తి చేసి ప్రమాదాలు జరగకుండా నివారించాలని కోరారు. రాయచోటి నుండి సుండుపల్లి వయా రాయవరం, పింఛ, ఆరోగ్యపురం, సొంటవారిపల్లి, పాపన్నగారిపల్లి, తదితర మారుమూల ప్రాంతాలకు సమయానుకూలంగా ఆర్ టీ సి సర్వీసులు ఉండాలన్నారు. సుండుపల్లి మండల కేంద్రంలో బస్ షాల్టర్ నందు పబ్లిక్ టాయ్లెట్ల ఏర్పాటు కు తక్షణ నిధులు కింద మంజూరు చేసి ప్రయాణికులు, స్కూల్, కాలేజీ, పిల్లలు, మహిళలు, వృద్ధులు యొక్క నిత్యావసర సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. రాయచోటి నుండి లక్కిరెడ్డిపల్లి వయా వర్రీకుంటపల్లె, జె వడ్డిపల్లెకు ఆర్ టి సి సర్వీసులు ప్రస్తుతం అక్కడ ప్రాంతాల ప్రజలు ప్రయాణికులు పడుతున్న సమస్యలు గుర్తించి గతంలో మార్దిరి ఆర్ టి సి సర్వీసులు ఉండాలని కోరడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించి ప్రజా సమస్యలు కొరకు త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు, పలువురు సమస్యలు పట్ల భాదితులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com