టెక్కలి ( జనస్వరం ) : సరుబుజ్జిలి మండలంలో గల ఆర్టీసి కాంప్లెక్స్ సమస్యలపై సోమవారం జనసేన పార్టీ మండల అధ్యక్షుడు పైడి మురళీమోహన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బాలజీ లఠకర్ కు వినతిపత్రం అందజేశారు. అనంతరం మురళీమోహన్ మాట్లాడుతూ సరుబుజ్జిలిలో గల ఆర్టీసీ కాంప్లెక్స్ ఇటీవల కురిసిన వర్షాలకు పూర్తిగా జలమయం అయిందని, కాంప్లెక్స్ కు ఆనుకుని ఉన్న చెరువు నీరు సైతం కాంప్లెక్స్ లో చేరి ప్రయాణీకులకు తీవ్రమైన ఇబ్బంది కలుగుతుందని అన్నారు. కాంప్లెక్స్ లో కనీస సౌకర్యాలైన త్రాగునీరు, మరుగుదొడ్లు లేకపోవడం బాధాకరమని అన్నారు. నాలగేళ్ళుగా ప్రయాణీకులు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నప్పటికీ స్థానిక వైసీపీ నాయకులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.కొత్తూరు నుండి శ్రీకాకుళానికి వెళ్ళే ప్రధాన రహదారి కావడంతో వందల సంఖ్యలో ప్రయాణీకులు కాంప్లెక్స్ లో వేచి ఉంటారని తెలిపారు. మహిళల ఆత్మగౌరవానికి భంగం వాటిల్లకుండా మరుగుదొడ్లు నిర్మించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, గౌరవ కలెక్టరు గారు స్పందించి తక్షణమే సమస్యలను పరిస్కరించాలని పైడి మురళీమోహన్ కోరారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు బొంగు అన్నం నాయుడు, సంఘంశెట్టి తేజేశ్వరరావు, రాయి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com