పత్తికొండ ( జనస్వరం ) : నియోజకవర్గ కేంద్రమైన పత్తికొండ పట్టణంలో, విద్యా, వైద్యం, అభివృద్ధికి, నోచుకోవడం నియోజకవర్గ నాయకుడు సిజి రాజశేఖర్ లేదని అన్నారు. ఈ సమస్యలపై కలెక్టర్ గారు లేకపోవడంతో, జాయింట్ కలెక్టర్ గారికి జనసేన పార్టీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేయడం జరిగింది అన్నారు. పత్తికొండలో ప్రధానంగా విద్యలో భాగంగా ఆదర్శ పాఠశాలలో, గత సంవత్సరం నుంచి టీచర్లు లేకపోవడంతో విద్యార్థులు జీవితాలు నాశనం అవుతున్నాయి. ఇప్పుడు స్కూల్లో ఆరు మంది పైగా స్కూల్ నందు టీచర్స్ లేరు కంప్యూటర్ కోర్సు కు సంబంధించిన ఉపాధ్యాయులు లేరు. అందువలన ఈ స్కూల్లో చదువుతున్న 700 మంది విద్యార్థులు చదువుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. మరి కొందరు విద్యార్థులు చదువుకోలేక మధ్యలోనే ఆపేస్తున్నారు. మోడల్ స్కూలుకు పిల్లలను పంపలేక టీషులు తీసుకొని వేరే ప్రైవేటు స్కూల్ నందు జాయినింగ్ చేస్తున్నారు, వెంటనే స్కూల్ నందు టీచర్స్ కొరత లేకుండా చూడాలని కోవడం జరిగింది. అలాగే వైద్యం పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు మెరుగైన వైద్యం అందించడం లేదు, ముఖ్యంగా పత్తికొండలో 30 పడకల ఆసుపత్రి కావడంతో, చుట్టుపక్కల గ్రామాల వారు పత్తికొండ ఆస్పత్రికి వివిధ రకాల వైద్యం కోసం వస్తున్నారు. రాత్రి సమయంలో వైద్యులు లేక రోగులు అత్యవసర ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఏదైనా అత్యవసరం అయితే, ఆదోని, లేక ,కర్నూలుకు తరలిస్తున్నారు. ఇక్కడ వైద్యం అందక మార్గం మధ్యలో చాలామంది మరణిస్తున్నారు. అలాగే మరొక సమస్య, పత్తికొండ పట్టణంలో రోడ్డు విస్తరణ పనులు జరుగుతాయని, తీసిన డ్రైనేజీ కాలువ ఇంతవరకు పూర్తి చేయకపోవడం ద్వారా, వివిధ షాపులు వారు, ఇంటి లోపలికి వెళ్లే కుటుంబ సభ్యులు, ఇబ్బంది పడుతున్నారు. ఎక్కువగా వృద్దులు చిన్నపిల్లలు రాత్రి సమయంలో కాలవలో కింద పడి, ప్రమాదాలు గురవుతున్నారు, ప్రస్తుతం పనులు జరగకపోవడంతో తీసిన కాలువ డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం, పైన తెలిపిన సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నాం. అలాగే రెండు వారాల క్రితం పత్తికొండ ఆర్డిఓ గారికి కూడా సమస్యలు తెలియజేసాం కానీ ఇంతవరకు పరిష్కరించలేదు. కావున మీరు వెంటనే సమస్యలు పరిష్కరించాలని, జనసేన పార్టీ తరపున కోరుచున్నామని అన్నారు. లేనియెడల జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ నాయకులు నాయకాల బాబ్జి, రెడ్డి పోగు నాగరాజ్, వెంకటేష్, రాఘవేంద్ర, రంగన్న, మరియు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com