
పామిడి ( జనస్వరం ) : జనసేనపార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పై వైసీపీ చేస్తున్నటువంటి వ్యక్తిగత విమర్శలను నిరసిస్తూ పామిడి మండలం జనసేన పార్టీ మండల అధ్యక్షుడు ఎం.ధనుంజయ ఆధ్వర్యంలో అంబేద్కర్ సర్కిల్ లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి వాసగిరి మణికంఠ,సంయుక్త కార్యదర్శి అరికెరి జీవన్ కుమార్, గుత్తి పట్టణ అధ్యక్షులు పాటిల్ సురేష్ హాజర య్యారు. అనంతరం జనసేన నాయకులు మాట్లాడుతూ ప్రజా సమస్యలపై జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తే ఆయన వ్యక్తిగత జీవితం పైన విమర్శలు చేయడం తగదన్నారు. రైతులు, ఉద్యోగస్తులు, మహిళలకు, యువతకు ఏమి చేయని ఇటువంటి ప్రభుత్వాలు అవసరమా అన్నారు. అధికారం లేకపోయినా రాష్ట్రంలో రైతులను ఆదుకున్న ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ అన్నారు. మీకు ఉన్నది ఆరు నెలలు మాత్రమే చేతనైతే ప్రజలకు మేలు చేయండి అంతేకానీ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేస్తే తగిన మూల్యం చెల్లించుకుంటారని వైఎస్ఆర్సిపి నాయకులు పై మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పామిడి మండల జనసేన పార్టీ నాయకులు రాము, అనిల్ కుమార్, సూర్య, అబ్దుల్, శివ కుమార్, శరత్ బాబు, భాస్కర్ గౌడ్, ధన, రత్న, రంగరాజు, శబరీష్, మహమ్మద్ హబీబ్, జనసేన పార్టీ నాయకులు జనసైనికులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.