Logo
Date of Publish : 17 April 2023, 12:18 pm
Editor : Sake Naresh

సాక్షి దినపత్రిక వార్తల్లో వ్యక్తికి – జనసేన పార్టీకి సంబంధం లేదు

     ఆముదాలవలస ( జనస్వరం ) : గత కొన్ని రోజులుగా పొందూరు మండలం, బురిడి కంచరాం గ్రామానికి చెందిన గులివెందుల అసిరి నాయుడు పై వస్తున్న ఆరోపణలలో భాగంగా, ఆయన జనసేన పార్టీ నాయకుడని , పొందూరు మండల జనసేన నాయకుడని వస్తున్న వార్తలను నియోజకవర్గ ఇన్చార్జి పేడాడ రామ్మోహన్ రావు గారు తీవ్రంగా ఖండించారు. జనసేన పార్టీని మండలంలో ఎదగకుండా చేయడానికి ఇది ఒక రాజకీయ ఎత్తుగడని ఆయన విమర్శించారు. ఆయనకు, పార్టీకి ఎటువంటి సంబంధం లేదని మండల అధ్యక్షులు యలకల రమణ గారు పత్రికా ప్రకటనలో తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆయన వ్యక్తిగత సమస్యలు కారణంగా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని , ఆయన కనీసం మా పార్టీలో క్రియాశీలక సభ్యులు కూడా కారని ఈ ప్రకటనలో తెలిపారు. ఇటీవల సాక్షి పత్రికలో వేసిన వార్తలో "జనసేన నాయకుడు కిరాణా వ్యాపారి బలి" అని ప్రచురించారు. దయచేసి ఈ వార్తను సవరించుకోవాల్సిందిగా ఆయన తెలిపారు. ఈ సమావేశంలో మండల నాయకులు కొంచాడ చిన్నమనాయుడు, పొన్నాడ బాలకృష్ణ, కోంచాడ సూర్య, గార బాబూ రావు, వసంత్ కుమార్, గణేష్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com