ఆళ్లగడ్డ, (జనస్వరం) : వినాయక చవితి పండుగ సందర్భంగా విగ్రహ ఏర్పాట్లును నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆళ్లగడ్డ జనసేన నాయకులు మైలేరి మల్లయ్య ఆళ్ళగడ్డ ఎమ్మార్వో రమేష్ రెడ్డి గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతినేలా రాష్ట్ర ప్రభుత్వం కరోనా థర్డ్ వేవ్ అంటూ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు. వైఎస్ఆర్ వర్ధంతి సభలకు, మద్యం షాపులు, రెస్టారెంట్లు, సినిమా హాళ్లు, ప్రభుత్వానికి ఆదాయం వస్తున్నటువంటి దేవాలయాలను తెరిచి రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నింపుకుంటున్నపుడు రాని కరోనా వినాయక విగ్రహాలు ఏర్పాటు చేస్తే వస్తుందా అని ప్రశ్నించారు. విగ్రహాల తయారీలో వ్యాపారులు అప్పులు చేసి విగ్రహాలు తయారు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఎన్నో కార్మిక కుటుంబాల పొట్ట కొట్టిందని తెలియజేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని నిబంధనలతో కూడిన అనుమతులతో విగ్రహ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఆళ్లగడ్డలో టిడిపి, బిజెపి, కాంగ్రెస్, వామపక్షాలు, విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ మరియు ప్రజా సంఘాలు కలిసి నిరసన కార్యక్రమం చేపట్టి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసేలా కార్యాచరణ చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గుర్రప్ప, ఆంజనేయులు, నయమత్ ఖాన్, రాజారామ్, కేశవ, రమేష్ సాగర్ తదితురులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com