
అరకు, (జనస్వరం) : అరకు వేలి మండలం పేదలబుడు పంచాయతీ పరిధిలో గల గర్డగుడ గ్రామంలో సోమవారం ఉదయం జనసేన పార్టీ నాయకులు సాయిబాబా, అల్లంగి రామకృష్ణ, L b. రవీంద్ర ఆధ్వర్యంలో ఆయా గ్రామాల్లో పర్యటించడం జరిగింది. అలాగే ఇంటింటికి జనసేన మాటలు, సిద్ధాంతాలు తీసుకెళ్తు, గిరిజనులతో సమావేశమై సమస్యల పట్ల చర్చించారు. ముఖ్యంగా గిరిజనుల పండించిన మిరియాల పంటలకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించడం లేదని జనసేన దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే స్పందించి గిరిజనులు పండించిన మిరియాల పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. అనంతరం గిరిజనులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని గిరిజనులతో నినాదాలు చేస్తూ ప్రభుత్వానికి నిరసన ద్వారా తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు, గ్రామస్తులు పాల్గొన్నారు.