గూడూరు, (జనస్వరం) : వైసీపీ పాలనలో ఇబ్బందులు పడ్డ అన్ని వర్గాల ప్రజలు చిలకలూరిపేటలో జరిగే ప్రజాగళం సభకు పెద్ద ఎత్తున తరలి రావాలని ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర్ రావు కోరారు. గూడూరు నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ చిలకలూరిపేట సమీపంలోని బోప్పూడి వద్ద జనసేన, బీజేపీ, టీడీపీల ఆధ్వర్యంలో జరిగే సభలో అన్ని వర్గాల ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న ప్రజా వ్యతిరేకతను తెలియచేయడం జరుగుతుందని, ఈ సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోది రాష్ట్ర భవితకు దిశా నిర్దేశం చేస్తారని తెలిపారు. 2014 ఎన్నికల్లో విజయం సాధించిన మూడు పార్టీల కాంబినేషన్ 2024 ఎన్నికల్లో పునరావృతం కావడం ఖాయమన్నారు. ప్రజాగళం సభను విజయవంతం చేసేందుకు జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు సమిష్టిగా కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో పిఓసీ మోహన్, నాయకులు ఇంద్రవర్ధన్, అవినాష్, సనత్, రాజశేఖర్, పెంచలయ్య, మురళి, సాయి, శివ, వసంత్, శంకర్, సన్ని తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com