Logo
Date of Publish : 02 March 2023, 3:39 pm
Editor : Sake Naresh

ప్రజల ఆదరణ మరువలేనిది : పవనన్న ప్రజాబాటలో జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి

    నెల్లూరు సిటీ ( జనస్వరం ) : జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా, నిరాటంకంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 290వ రోజున 46వ డివిజన్ హెడ్ పోస్ట్ ఆఫీస్ వీధిలో జరిగింది. ఈ ప్రాంతంలో ప్రతి ఇంటికీ వెళ్ళిన కేతంరెడ్డి ప్రజల సమస్యలను అధ్యయనం చేసి అండగా నిలబడతామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ప్రజలు తమను అపూర్వంగా ఆదరిస్తున్నారు కనుకనే పవనన్న ప్రజాబాట కార్యక్రమం ఎటువంటి ఆటంకాలు లేకుండా 290 రోజులుగా జరుగుతోందన్నారు. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలనే ఆకాంక్ష ప్రజల్లో బలంగా ఉందని, అది ప్రస్ఫుటంగా కనిపిస్తోందన్నారు. త్వరలో 300 రోజుల మైలురాయికి ఈ కార్యక్రమం చేరుకోనుందని, ఇన్ని రోజుల తమ పయనంలో నగరంలోని ఒక్కో ప్రాంతంలో అక్కడి సమస్యలను అధ్యయనం చేసి అవకాశం దక్కిందని, ఒక్కో ప్రాంతం సాంద్రత అవగతం అయ్యిందని అన్నారు. ప్రజలందరి ఆశీస్సులతో వచ్చే ఎన్నికల్లో నెల్లూరు సిటీలో గెలవబోయేది తామేనని, పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో నెల్లూరు నగరాన్ని సమగ్ర అభివృద్ధి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com