కార్వేటినగరం ( జనస్వరం ) : మండల కేంద్రంలో.. సీఎం జగన్ మోహన్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసిన జన సైనికులు. గ్రామ/వార్డు వాలంటీర్లకు వ్యతిరేకంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన మాటలను వక్రీకరించినందుకు జన సైనికుల నిరసనలు తెలియజేసారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఇన్చార్జ్ డా. యుగంధర్ పొన్న ఆధ్వర్యంలో కోదండ రామాపురం రోడ్డు నుండి బస్టాండ్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించి, మానవహారం చేసి పెద్ద సంఖ్యలో హాజరైన జనసేన పార్టీ జనసేన సైనికులు. సీఎం జగన్ దిష్టిబొమ్మను పాడే మోసి అనంతరం జన సైనికులు దగ్ధం చేసారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి, ఆయనకు వత్తాసు పలికే డిప్యూటీ సీఎం నారాయణస్వామి పవన్ కళ్యాణ్ కు భేషరతుగా క్షమాపణ చెప్పాలి.. అంటూ జనసైనికుల నిరసనలు చేసారు. జనసేన పార్టీ ఇంచార్జ్ యుగంధర్ మాట్లాడుతూ రాజకీయ పరిజ్ఞానం పవన్ కళ్యాణ్ కు లేదన్న నీవు సత్యవేడులో ఒకసారి, జీడీ నెల్లూరు నియోజకవర్గంలో ఆదివారం రెండు సార్లు ఎమ్మెల్యేగా ఉండి ఏమి సాధించావు నీ రాజకీయ పరిజ్ఞానంతో అంటూ నిలదీశారు. దేవతల వ్యవస్థలోకి (వాలంటీర్) నీ భార్య పరంజ్యోతిని నియమించి, జడ్పీటీసీ స్థానంలో నిన్ను నమ్మిన వెంకటరత్నంను కూర్చోబెట్టగలవా? నీ భావ మరిది ఉన్న సర్పంచ్ స్థానంలో పాదిరికుప్పంలో వాలంటీర్ కి ఇస్తావా? అంత నిజాయితీ, నిబద్దత ఉందా? అలా చేస్తే నీకు సలాం చేస్తానని సవాల్ విసిరారు. వాలంటీర్ లకు తీవ్రని నష్టం వైసీపీ ప్రభుత్వం వలన జరుగుతోందని దుయ్యబట్టారు. వాలంటీర్ అనే ఎదుగుదల లేని రాజ్యాంగ వ్యతిరేక పోస్టులో నియమించి, జీవితానికి జీతానికి గ్యారెంటీ, విలువ లేకుండా వైసీపీ చేస్తోందని, పిన్ని, బాబాయ్ అంటూ ఇంటి పక్కన వారితో ఉండాల్సిన నిన్ను, వైసీపీ సభలకు రాకపోతే మీ పథకాలు కట్ చేస్తా అని వారిని బెదిరించేలా వైసీపీ చేస్తోందని నీ వ్యక్తిగత ఫోన్ నెంబర్ ఎవరికైనా ఇవ్వాలంటే 10 సార్లు ఆలోచించే నువ్వు, ఈరోజు ప్రజల వ్యక్తిగత వివరాలు తీసుకునే అవసరం కల్పిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఉద్యోగం చేయాల్సిన నిన్ను రోడ్డు మీద బలవంతపు ధర్నాలకు వచ్చే పరిస్థితి తీసుకొచ్చింది వైసీపీయేనని, డిగ్రీలు చదివిన పనికి తగిన వేతనం లేకుండా చేసింది వైసీపీయేనని, జగన్ చెప్పింది వింటే 5 వేల దగ్గర అవమానాలు పడుతూ ఉంటావని, పవన్ కళ్యాణ్ చెప్పింది అర్ధం చేసుకుంటే 10లక్షల పెట్టుబడి సాయంతో నీ కాళ్ళ మీద నువ్వు నిలబడతావు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్వేటినగరం మండల అధ్యక్షులు శోభన్ బాబు, టౌన్ కమిటీ అధ్యక్షులు రాజేష్, ఉపాధ్యక్షులు విజయ్, సురేష్ రెడ్డి, మండల యువజన అధ్యక్షులు నరసింహులు, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, నియోజకవర్గ యువజన ప్రధాన కార్యదర్శి వెంకటేష్, జిల్లా కార్యక్రమ కమిటీ సభ్యులు భానుచందర్ రెడ్డి, టౌన్ కమిటీ కార్యదర్శి మనీ,సూర్య, టౌన్ కమిటీ ప్రధాన కార్యదర్శి మహేంద్ర, వెదర్ కుప్పం మండల యువజన అధ్యక్షులు సతీష్, వెదురు కుప్పం మండల బూత్ కన్వీనర్ యతీశ్వర్ రెడ్డి, కార్వేటి నగరం మండల బూత్ కన్వీనర్ అన్నామలై, సీనియర్ నాయకులు చంద్ర, శేఖర్ రెడ్డి పాల్గొన్నారు.