గుడివాడ ( జనస్వరం ) : కృష్ణాజిల్లా గుడివాడ పట్టణ బస్టాండ్ సెంటర్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల ప్రజల దాహార్తి తీర్చిన గుడివాడ పట్టణ జన సైనికులు. ఈ సందర్భంగా గుడివాడ పట్టణ జనసేన నాయకులు డాక్టర్ మాచర్ల రామకృష్ణ(Rk) మాట్లాడుతూ మానవసేవయే మాధవసేవ అనే నినాదంతో ఆంధ్రుల అన్నపూర్ణ శ్రీమతి డొక్కా సీతమ్మ గారి ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో గుడివాడ పట్టణంలో ఎండ తాకిడికి ప్రజలు తీవ్ర ఇబ్బంది పడడంతో ఉచిత చల్లని మజ్జిగ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేసినారు అదేవిధంగా గుడివాడ పట్టణంలో అనేక సేవా సంస్థలు వారి ట్రస్ట్ పేరు మీద వాడవాడలా చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల దాహార్తి తీర్చవలసిందిగా కోరుతున్నయమని అదేవిధంగా గుడివాడ పట్టణ పోలీస్ వారు వారి డ్యూటీనే కాకుండా ఎండ తీవ్రత వల్ల ప్రజల ఇబ్బంది గ్రహించి పలుచట్ల మజ్జిగ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నందుకు మా జనసేన పార్టీ తరపున పోలీసు వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నూనె అయ్యప్ప, దివిలి సురేష్, చరణ్ తేజ, శివ, చరణ్, గళ్ళ శ్రీనివాసరావు, మరియు జన సైనికులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com