నెల్లూరు ( జనస్వరం ) : సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిరాటంకంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 63వ రోజున మూలాపేట యాదవ వీధిలో జరిగింది. ఈ ప్రాంతంలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి కుటుంబాన్ని పలుకరించి సమస్యల అధ్యయనం చేసిన కేతంరెడ్డి ఆ సమస్యల పరిష్కారానికి తమవంతు పోరాటం చేస్తామని ప్రజలకు భరోసా కల్పించారు. సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అధ్వాన్నంగా మారిన రోడ్ల పరిస్థితి పై మూడు రోజులపాటు జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన డిజిటల్ క్యాంపెయిన్ లో పార్టీ శ్రేణులతో పాటు సాధారణ ప్రజలు కూడా పాల్గొన్నారన్నారు. నిన్న జరిగిన జిల్లా పరిషత్ సమావేశంలో వైసిపి సభ్యులే రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందని, జిల్లాలో అనేక ఉదాహరణలు తెల్పుతూ ప్రతి చోట రోడ్డుపై పడి ప్రజలు మరణిస్తున్నారని, ఈ రోడ్లపై నడుస్తూ గడపగడపకు వెళ్ళలేక పోతున్నామని తెలిపారన్నారు. రెండు రోజుల కిందట నెల్లూరు నగరంలో సైతం కె.వి.ఆర్ పెట్రోల్ బంకు సమీపంలో రోడ్డుపై గుంతలు తప్పించబోయిన ఆటోలో నుండి ఖాదరమ్మ అనే ముస్లిం మహిళ రోడ్డు పైబడి చికిత్స పొందుతూ మరణించింది అని అన్నారు. పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నా కూడా వైసీపీ ప్రభుత్వంలో కనీస చలనం లేదని, ఈ ప్రభుత్వానికి ప్రజలు బుధ్ధి చెప్పే రోజులు ఎంతో దూరంలో లేవని, ఎప్పుడు ఎన్నికలు జరిగినా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని కేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.