మైలవరం ( జనస్వరం ) : జి. కొండూరు కవులూరు రోడ్డులో బుడమేరు పోలవరం వంతెన శిథిలావస్థకు చేరిందని వంతెన సైడు భాగం సపోర్ట్ గా ఉండే రైలింగ్ 3 సంవత్సరాలు క్రితం పడిపోవడం వలన ప్రజలకు ప్రాణాలు అరచేతిలో పెటుకోని ప్రయాణం చేయవలసి వస్తుందని మైలవరం ఇంచార్జ్ అక్కల రామమోహనరావు (గాంధీ) అన్నారు. గతంలో అధికారులు దృష్టికి జనసేన పార్టీ తరుపున తీసుకువెళ్లటం జరిగింది కానీ అధికారులు పటించుకోవడం లేదన్నారు. తక్షణమే వంతెన మరమ్మతులు చేయాలని కవులూరు రోడ్డు బాగు చేయాలి అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండలకమిటీ మెంబెర్స్, బుల్లా రాజు, కిషోర్, గణేష్, తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com