ప్రకాశం ( జనస్వరం ) : షేక్ రియాజ్ గారి సూచనల మేరకు ఒంగోలు నగర జనసేన పార్టీ కార్యదర్శి గోవింద్ కోమలి గారి ఆధ్వర్యంలో ప్రజా సమస్యలను తెలుసుకోవడంలో భాగంగా 65వ రోజు జనచైతన్య యాత్ర లో భాగంగా ఒంగోలులోని 24వ డివిజన్ లోనీ వంట కాలనీ లో పర్యటించి ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక ప్రజానీకం జనసేన నాయకులతో మాట్లాడుతూ ఈ జగన్ రెడ్డి ప్రభుత్వంలో పెరిగిన ధరలతో మేము జీవనం సాగించడం చాలా కష్టంగా మారిందని అన్నారు. ప్రజల ఆదాయం పెరగలేదు కానీ కుటుంబ పోషణ ఖర్చు మాత్రం పెరిగిందని, ఇప్పటిదాకా అందరికీ ఒక అవకాశం ఇచ్చామని మాకు ఎవరూ చేసింది ఏమీ లేదని అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తాను అధికారంలోకి వస్తే ఏమి చేస్తారో చెప్పిన విధానం మమ్మల్ని బాగా ఆలోచింప చేసిందని అలాంటి నాయకుడికి ఈసారి అండగా నిలుస్తామని అన్నారు. అలానే పడకేసిన పారిశుధ్యంతో రోగాల బారిన పడుతున్నామని పట్టించుకునే నాధుడు లేడని వాపోయారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి సారధ్యంలో ఏర్పాటు కాబోయే ప్రభుత్వంలో మన ప్రాంత అభివృద్ధికి కచ్చితంగా పాటుపడతామనిఅన్నారు. కీలకమైన సమస్యలను అధికారంలోకి వచ్చిన వెంటనే తీర్చేలా ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి కళ్యాణ్ ముత్యాల, ఒంగోలు నగర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పల్ల ప్రమీల, ఒంగోలు నగర జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి ఆకుపాటి ఉష, వీర మహిళ మాదాసు సాయి నాయుడు, 28వ డివిజన్ అధ్యక్షులు కోట సుధీర్, 21వ డివిజన్ అధ్యక్షురాలు వాసుకి నాయుడు మరియు జనసేన నాయకులు అరవింద్ బాబు ముత్యాల, చెన్ను నరేష్, నరసింహారావు,రాఘవ చంగళశెట్టి, గలగల పవన్, జనసేవ శ్రీనివాస్, యాదల సుధీర్, అవినాష్ పర్చూరి తదితరులు పాల్గొన్నారు.