నెల్లూరు ( జనస్వరం ) : వైకాపా ప్రభుత్వ అవినీతి అక్రమ పాలన అంతమొదించేదుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని జనసేన పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర్ రావు అన్నారు. గూడూరు మండలంలోని విందూరు గ్రామంలో ఆదివారం కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన అనంతరం మాతమ్మ ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం ఉమ్మడి పార్టీల మేనిఫెస్టోలోని ప్రధానమైన అంశాలను ప్రజలకు వివరిస్తూ ఇంటింటికి ప్రచారం నిర్వహించి ఉమ్మడి అభ్యర్థి పాశం సునీల్ కుమార్ ని గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ రెడ్డి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని జగన్ పాలనపై అన్ని వర్గాలు ప్రజలు విసిగిపోయి ఉన్నారని తెలిపారు. వైసీపీ రాక్షస పాలన నుంచి ప్రజలు విముక్తి కోరుకుంటున్నారని, జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలను ఆశీర్వదించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. రాష్టాన్ని అభివృద్ధి పథం వైపు నడిపించే బాధ్యత బిజెపి కేంద్ర ప్రభుత్వ సహకారంతో జనసేన, టీడీపీలు తీసుకుంటాయని తెలిపారు
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com