గంగాధర నెల్లూరు ( జనస్వరం ) : వెదురు కుప్పం మండలం, డీకేఎం పురం గ్రామపంచాయతీ, టి ఆర్ పురం గ్రామవాసులకు కేటాయించిన జగనన్న కాలనీలో మిగులు భూమిని రాత్రికి రాత్రి జెసిబి పెట్టి ఆక్రమించుకోవడానికి గల కారణం ఏమిటని నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ డిమాండ్ చేశారు. జనసేన తెలుగుదేశం ఆధ్వర్యంలో జగనన్న కాలనీని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టి ఆర్ పురం గ్రామ ఐక్యత కోసం నాలుగు సంవత్సరాలుగా ఇంటి పట్టాల కోసం కాళ్లు అరిగేటట్లు అధికారుల చుట్టూ తిరుగుతున్న పేదలకు సమన్యాయం జరగాలి, వారికీ ఇంటి పట్టాలి ఇవ్వాలని డిమాండ్ చేసారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని వెంటనే చర్యలు చేపట్టాలని, టి ఆర్ పురం జగనన్న కాలనీని సందర్శించి నిజా నిజాలు నిగ్గుతేల్చి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. వీరికి న్యాయం చేయకపోతే జెఎస్పి టిడిపి సంయుక్తంగా న్యాయం జరిగేంతవరకు వీరోచిత పోరాటం చేస్తామని తెలియజేశారు.ఉపముఖ్యమంత్రి ఇలాక అవినీతిమయంగా మారిందని, నారాయణ స్వామి సమర్థుడు కాదని, పర్యవేక్షణ తెలియని పనికిరాని మంత్రని ఎద్దేవా చేశారు. ఒక రెగ్యులర్ తాసిల్దార్ ను నియమించుకోలేని అసమర్ధుడని, టికెట్ వేటలో పడి నియోజకవర్గాన్ని గాలికొదిలేసారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు లోకనాథ్ రెడ్డి, జనసేన పార్టీ వెదురుకుప్ప మండల అధ్యక్షులు పురుషోత్తం, టిడిపి మండల మాజీ అధ్యక్షులు క్లస్టర్ ఇంచార్జి మోహన్ మురళి క్లస్టర్ ఇంచార్జి చంగల్రాయిరెడ్డి, టీ.కే.యం.పురం టిడిపి గ్రామ కమిటీ అధ్యక్షుడు మోహన్ రెడ్డి మాజీ సర్పంచులు రాజారెడ్డి, బాబు రెడ్డి, జగన్నాథం నియోజకవర్గ టిఎన్టియుసి ఉపాధ్యక్షులు గంగయ్య, నియోజకవర్గ మహిళ ఉపాధ్యక్షురాలు చిట్టెమ్మ,మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు వరప్రసాద్, నాయకులు మాధవనాయుడు వెంకటాద్రినాయుడు, నాగిరెడ్డి, చిన్నమిరెడ్డి, వెంకటరెడ్డి నియోజకవర్గం యువజన ప్రధాన కార్యదర్శి వెంకటేష్, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ జనసైనికులు, గ్రామస్తులు పాల్గొన్నారు.