సర్వేపల్లి ( జనస్వరం ) : జనసేన, తెలుగుదేశం పార్టీల విజయ యాత్ర రెండవ రోజైన సోమవారం సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆధ్వర్యంలో పాదాల దగ్గర నుంచి మొదలై ముత్తుకూరు మండలంలోని కప్పల దరువు నందు వెలసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి పాదాల వరకు చేరుకుంది. ఈ యాత్రలో భాగంగా ముత్తుకూరు మండలంలోని అనేక గ్రామాలలో ప్రజలు పడుతున్న సమస్యలను అడిగి తెలుసుకోవడంతోపాటు ఇటీవల వచ్చిన మిచౌంగ్ తుఫాన్ కారణంగా అన్ని కులాల వారికి న్యాయం జరగలేదు. తుఫాన్ ఆర్థిక సహాయం అందించలేదని చెప్పి ప్రజలు అల్లాడిపోతూ ఏడు రోజులపాటు వర్షాల కారణంగా జీవనోపాధి లేక ఇళ్లలోని ఉన్న మాకు ఎవరు కూడా రూపాయి సహాయం చేసిన వాళ్ళు లేరు అని చెప్పి వాళ్ళు చాలా బాధపడుతున్నారు. అయితే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గోవర్ధన్ రెడ్డి గారిని నేను ఒకటే కోరుతా ఉన్న సర్వేపల్లి నియోజకవర్గంలో అన్ని కులాల వారు ఓట్లు వేస్తేనే మీరు గెలిచారు. ఈ విషయాన్ని మీరు మర్చిపోయినట్టు ఉన్నారు. మరి గిరిజనులకి ఆర్థిక సహాయం అందించే దాంట్లో కూడా కోతలు జరిగి ఉన్నాయి. ఈ కోతలకు గల కారణాలు ఏంటి ఆ మిగులు నగదు ఎవరు మింగేసారు. ఈ విషయాన్ని ఇప్పటివరకు మీరు ఎక్కడ కూడా ప్రస్తావన జరగాలా నేను ఇంతమందికి ఇచ్చానని లెక్కలు చెప్తున్నారు. మేము స్వచ్ఛందంగా సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రజలను అడిగి తెలుసుకునే వాళ్ళతో మాట్లాడే విషయాన్ని మీకు తెలియజేస్తున్న మీడియాపర్వకంగా ఇకనైనా కళ్ళు తెరవండి మీకు ఇంకా 60 రోజులే గడువు ఈ 60 రోజుల తర్వాత సర్వేపల్లి నియోజకవర్గం ప్రజలే డిపాజిట్లు లేకుండా మిమ్మల్ని ఇంటికి పంపిస్తారు. ఈ విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోండి మసిబూసి మారేడు కాయ చేయాలనుకుంటున్నారు కానీ ప్రజలు ఎంతో తెలివిగా ఉన్నారు. సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు రేపు 2024 జనసేన తెలుగుదేశం కలిసి ప్రజా ప్రభుత్వాన్ని స్థాపిస్తుంది. సర్వేపల్లి నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేస్తామో చూపిస్తాం. ఈ విజయ యాత్రలో మాతో పాల్గొన్న వీర మహిళ విజయలక్ష్మి, ముత్తుకూరు మండల సీనియర్ నాయకులు రహీం, అశోక్, సుమన్, మస్తాన్, మురళి, వెంకటాచలం మండల కార్యదర్శి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.