ఏలూరు, (జనస్వరం) : నగరపాలక సంస్థ పరిధిలోని 18వ డివిజన్ లక్ష్మమ్మ చెరువుగట్టు ప్రాంతంలో ప్రజలు త్రాగునీరు, డ్రైనేజీ సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, వైసిపి నగర పాలకులకు, డివిజన్ నాయకులకు, నగరపాలక సంస్థ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించిన తమ సమస్యలను పట్టించుకోవడం లేదని, జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు కు డివిజన్ ప్రజలు విన్నవించారు. జనసేన పోరుబాటులో భాగంగా శుక్రవారం 18వ డివిజన్ లక్ష్మమ్మ చెరువుగట్టు ప్రాంతంలో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ 18వ డివిజన్ లో డ్రైనేజీ సౌకర్యం లేదని, త్రాగునీరు కుళాయిలు భూగర్భంలో పాటుకు పోయాయని, మరికొన్ని చోట్ల త్రాగునీరు కొళాయిలు త్రాగునీరు సక్రమంగా సరఫరా కావడం లేదని, డ్రైనేజీలలో మురుగు తీయకపోవడంతో,పారక ములుగు పేరుకుపోయి పారిశుద్ధ్య సమస్యలు ఏర్పడి, దుర్గన్నంతో దోమలు విజృంభించి అనారోగ్య సమస్యలతో ఆస్పత్రులపాలవుతున్నామని డివిజన్ ప్రజలు జనసేన నియోజకవర్గ ఇన్చార్జ్ కు తమ సమస్యలను ఏకరూపెట్టారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు 18వ డివిజన్ లక్ష్మమ్మ చెరువు గట్టు ప్రాంత ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ మాట్లాడుతూ జనసేన లక్ష్మమ్మ చెరువుగట్టు ప్రాంత ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిందిగా నగర పాలక సంస్థ పాలకులను, హెల్త్ విభాగంఅధికారులను హెచ్చరించారు. లక్ష్మమ్మ చెరువుగట్టు ప్రాంత ప్రజల సమస్యలను పరిష్కరించిన పక్షంలో 18వ డివిజన్ వైసిపి నాయకులను త్వరలోనే డివిజన్ ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని అన్నారు. ఏలూరు నగర పాలకులు, నగర పాలక సంస్థ పారిశుద్ధ్య విభాగం అధికారుల నిర్లక్ష్యంతో డివిజన్ ప్రజలు విసిగిపోయారని, ఎన్నిసార్లు నగర పాలకులకు, నగరపాలక సంస్థ మేయర్, కమిషనర్ కు, డివిజన్ కార్పొరేటర్ కువిన్నవించినా ఈ డివిజన్ సమస్యలపై కన్నెత్తి చూడడం లేదని 18వ డివిజన్ ప్రజలు ఆరోపించారు. నగరపాలక సంస్థ పాలకవర్గం సమస్యలపై దృష్టి సారించి సమస్యలుపరిష్కరించాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తోందని అప్పలనాయుడు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, కార్యదర్శి కందుకూరిఈశ్వరరావు, ఎట్రించి ధర్మేంద్ర, గొడవర్తి నవీన్ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ జనసేన రవి, చిత్తిరి శివ, కోలా శివ నాయకులు నిమ్మల శ్రీనివాసరావు, రెడ్డి గౌరీ శంకర్, వీరంకి పండు, కాకర్ల శ్రీను, ప్రసాద్, బాబు స్థానిక నాయకులుబి.సన్యాసిరావు, ఎమ్.దుర్గారావు, శ్రావణి, పల్లి విజయ్, భూపతి ప్రసాద్, దాసరి బాబి తదితరులు పాల్గొన్నారు..