మదనపల్లి ( జనస్వరం ) : మదనపల్లి పట్టణంలోని గొల్లపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ … ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షారులతో కలుస్తూ కేసులకు సంబంధించిన లీఫ్ ల. ద్వారా రిలీఫ్ అవుతున్నారని ఎద్దేవా చేశారు. కేసులు మాఫీ చేసుకునేందుకు ఢిల్లీ పర్యటనలు తప్ప… రాష్ట్రానికి రావలసిన ప్రత్యేక హోదా అడిగిన పాపాన పోలేదని వాపోయారు. విజయవాడ , విశాఖపట్నం మెట్రో రైల్ అడగలేదని , మదనపల్లి ,బెంగళూరు రైల్వే లైన్ అమలు చేయడంలో విఫలమయ్యారని విమర్శలు గుప్పించారు. బిజెపి ప్రభుత్వంతో ప్రత్యక్ష పొత్తు ఉండేది ఒక్క వైసీపీ పార్టీకే అని స్పెషల్ స్టేటస్ పై ప్రతిసారి పవన్ కళ్యాణ్ పై నిందలు వేయడం తగదని హితవు పలికారు. కేంద్ర ప్రభుత్వంతో అన్ని విధాల సఖ్యతతో ఉన్నది ఒక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే అని ఇప్పుడు కర్ణాటకలో జరగబోయే ఎన్నికలకు పెద్ద మొత్తంలో డబ్బులు పంపించి బిజెపి ప్రభుత్వాన్ని గెలిపించేందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కృషి చేస్తున్నాడని ఆరోపించారు. ఇప్పటివరకు కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన సొంత లాభం కోసమే ఢిల్లీ పర్యటన చేశారు తప్ప రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం కానీ రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ, ఢిల్లీ పర్యటనలు చేసిన దాఖలాలు లేవని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం బిజెపి ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో పవన్ కళ్యాణ్ ఒక్కడే ముందు ఉన్నాడని అన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటు కణంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఎదిరించారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాని ప్రతిపక్ష ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని ప్రశ్నించకపోవడం వెనుక వారు చేసిన అవినీతిలే కారణమని డాక్టర్ మై ఫోర్స్ మహేష్ ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ అవినీతి రహిత పాలన అందించాలంటే అది ఒక్క పవన్ కళ్యాణ్ కి మాత్రమే దక్కుతుందన్నారు. రాష్ట్ర రాజకీయాలలో మచ్చలేని నాయకుడు పవన్ కళ్యాణ్ మాత్రమే అని ధీమా వ్యక్తం చేశారు. రాబోవు ప్రధాన ఎన్నికలలో పవన్ కళ్యాణ్ ని గెలిపించి ముఖ్యమంత్రిని చేసుకుంటే పార్టీని అధికారంలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకురాలు మల్లిక, శోభ, రూప, సునీత, జనసేన పార్టీ నాయకులు శ్రీనాథ్, గంగాధర, లక్ష్మీపతి, సోను, నాగేంద్ర, హర్ష, దేవా తదితర జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు