● పవనన్న ప్రజాబాటలో ఆత్మకూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్
ఆత్మకూరు, (జనస్వరం) : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిని చేయాలన్న లక్ష్యంతో మొదలుపెట్టిన పవనన్న ప్రజాబాట కార్యక్రమం ఈరోజు ఆత్మకూరు నియోజకవర్గంలో 6 వ రోజుకు చేరుకుంది. ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని 2 వ వార్డు వెంకట్రావుపల్లిలో ఈరోజు పర్యటించడం జరిగింది. రోడ్లు, డ్రైనేజీ, మంచి నీళ్ళు మొదలగు ప్రాథమిక సౌకర్యాలు కూడా లేని ఈ ప్రాంతంలో ప్రజలు పడుతున్న బాధలను తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆత్మకూరు నియోజకవర్గం ఇంఛార్జ్ నలిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మంచి మనసున్న పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిని చేసుకుందామని ప్రజల సమస్యలన్నీ తీర్చగల శక్తి ఒక పవన్ కళ్యాణ్ కి మాత్రమే ఉన్నదని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు నియోజకవర్గ జనసేన నాయకులు దాడి భాను కిరణ్, రాకేష్, వంశీ, చంద్ర, అనిల్, సురేష్, వేణు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com