రాప్తాడు ( జనస్వరం ) : అనంతపురం రూరల్ మండలం, రాచనపల్లి గ్రామంలో ఉన్న సిఫ్లాన్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా రాచనపల్లి గ్రామ ప్రజలతో సంతకాలను సేకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజలు స్వచ్చందంగా మాకు ఆ ఫ్యాక్టరీ వద్దని, దాని వల్ల మా గ్రామం మరియు చుట్టూ పక్క ఉన్న గ్రామాల ప్రజలు నాశనం అవుతున్నారని స్థానిక ప్రజలు అన్నారు. అలాగే భూగర్భ జలాలు కలుషితమై పంటలు పండడం లేదని వారి ఆవేదనను వ్యక్తం చేశారు. గతంలో ఎన్నోసార్లు ప్రభుత్వాన్ని, నాయకులకు విన్నవించుకున్నా ప్రయోజనం లేదన్నారు. ఫ్యాక్టరీ వల్ల ప్రజలు, రైతులు, మూగజీవాలు దెబ్బ తింటున్నా ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో రాప్తాడు ఇంచార్జ్ సాకే పవన్ కుమార్, జిల్లా సంయుక్త కార్యదర్శి కొడిమి నారాయణ స్వామి, కార్యనిర్వాహక సభ్యుడు మధు, రాచనపల్లి వెంకటేష్, మరియు రాయల్ నరేష్, సదాశివ, ముస్తఫా, రామకృష్ణ, నజీమ్, పృద్వి, నారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com