గుంటూరు ( జనస్వరం ) : ఐదేళ్ల వైసీపీ పాలనలో పేదల బ్రతుకు ఛిద్రం అయిందని, వైసీపీని ఓడించేందుకు ప్రజలు సంసిద్ధులై ఉన్నారని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అన్నారు. ప్రజల విశ్వాసాన్ని, నమ్మకాన్ని కోల్పోయిన వైసీపీ నేతలకు ఓటమి కళ్ళముందు కదలాడుతుందటంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారన్నారు. శనివారం శ్రీనివాసరావుతోటలోని గాజు గ్లాస్ దిమ్మె వద్ద సిద్ధం కాదు …ఓటమికి సన్నద్ధం పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆళ్ళ హరి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సాగిస్తున్న అరాచక , అవినీతి , దాష్టీక పాలనతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందన్నారు. దీంతో వైసీపీ శ్రేణుల్లో నిలువెల్లా నిరాశా నిస్పృహలు ఆవహించాయన్నారు. తమకు రానున్న ఎన్నికల్లో ఘోర పరాభవం తప్పదన్న భావన ప్రతీ వైసీపీ నాయకుడిలో, కార్యకర్తల్లో ఉందన్నారు. సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రి జగన్ రెడ్డే తాను సంతోషంగా దిగిపోతా అంటూ చెప్పటంతో వైసీపీ శ్రేణులకు ధైర్యం చచ్చిపోయిందని వీరిలో ఆత్మస్తైర్యాన్ని నింపేందుకు చివరి ప్రయత్నంగా సిద్ధం పేరుతో ప్రచారం ప్రారంభించారని ఎద్దేవా చేశారు. వైనాట్ 175 నుంచి పోటీ చేయటానికి అభ్యర్థులు దొరకని స్థితికి వైసీపీ దిగజరిపోయిందన్నారు. గత ఎన్నికల్లో నమ్మి వెన్నంటి నిలిచిన దళితులు, బీసీలు, ముస్లిం మైనారిటీలు, కాపులు దూరం అవ్వటంతో వైసీపీ ఇక రాష్ట్రంలో గెలిచే పరిస్థితి లేదన్నారు. వైసీపీని ఓటమి నుంచి తప్పించే శక్తి ఎవరికీ లేదన్నారు. వైసీపీ నేతలు ఓటమిని స్వీకరించటానికి సంసిద్దంగా ఉండాలన్నారు. రానున్న ఎన్నికల్లో జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థులను గెలిపించాలన్నారు. వైసీపీ పాలనలో ద్వంసమైన, నిర్వీర్యమైపోయిన వ్యవస్థల్ని పునర్ణించుకుందామని ఆళ్ళ హరి ప్రజల్ని కోరారు. కార్యక్రమంలో జనసేన పార్టీ డివిజన్ అధ్యక్షుడు సయ్యద్ షర్ఫుద్దీన్, టీడీపీ డివిజన్ అధ్యక్షుడు నాగూర్ వలి,కొలసాని బాలకృష్ణ, బాలాజీ, నండూరి స్వామి, వడ్డె సుబ్బారావు, అలా కాసులు, షేక్ గౌస్, కోలా మల్లి, తిరుమలరావు చౌదరీ, ఇల్లా చిరంజీవి, పోతురాజు, పాండు, బియ్యం శ్రీను తదితరులు పాల్గొన్నారు.