అనంతపురం ( జనస్వరం ) : జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ ఉమెన్ కో-ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత మహిళలతో మాటామంతి కార్యక్రమం జరిగింది. అందులో భాగంగా 32వ రోజు అనంతపురం అర్బన్ నియోజక వర్గంలోని స్థానిక 5వ డివిజన్ శ్రీనివాస నగర్ లో పర్యటించి స్థానిక మహిళలతో మమేకమై స్థానిక సమస్యలు తెలుసుకొని జనసేన టీడీపీలకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగన్ రెడ్డి మోసపు అపద్దపు మాటలు నమ్మే పరిస్తితిలో ప్రజలు లేరని ఇది 2019 కాలం కాదని ప్రజలందరూ గ్రహించి జగన్ కు బుద్ది చెపాలని అన్నారు. జనసేన టీడీపీ పార్టీలకు ఓటు వేయడానికి సంసిద్దులై ఉన్నారని. జనసేన టీడీపీ పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో ఆంధ్ర రాష్ట్రాన్ని సంక్షేమం అభివృద్ధి వైపు నడిపే విధంగా ఉందని ఈ విషయాలన్నీ ప్రజలకు వివరంగా వివరిస్తున్నామని ప్రజలంతా సానుకూలంగా స్పందిస్తారని అన్నారు. వచ్చేది,సుపరిపాలన అందించేది ఉమ్మడి ప్రభుత్వమే అన్నారు. ఈ కార్యక్రమంలో వీర మహిళలు, జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com