
ఆత్మకూరు, (జనస్వరం) : ఆత్మకురు నియోజకవర్గం జనసేనపార్టీ ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్ ఆధ్వర్యంలో జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం నిర్విరామంగా 8 వ రోజున ప్రియదర్శిని నగర్ లో జరిగింది. ఈ ప్రాంతంలో ప్రతి ఇంటికీ వెళ్ళి ప్రజాసమస్యల అధ్యయనం చేసిన నలిశెట్టి శ్రీధర్ ఆ సమస్యల పట్ల తమవంతు పోరాటం చేస్తామని ప్రజలకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఆత్మకూరు నియోజవర్గ జనసేనపార్టీ ఇంఛార్జ్ నలిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ వైసీపీ పాలనతో ప్రజలంతా విసిగి వేసారి పోయారని విమర్శించారు. సీఎం జగన్ అభివృద్ధిని గాలికొదిలేసి ఉచితాలు మళ్ళీ గెలిపిస్తాయనే భ్రమలో ఉన్నారన్నారు. ఎల్లకాలం ఓటు రాజకీయాలు సాగవని, నీతి నిజాయితీగా ప్రజలకు అండగా నిలుస్తూ అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉంటుందన్నారు. నేటి రాజకీయాల్లో నీతివంతమైన రాజకీయాలు చేసే నాయకులు ఒక్క పవన్ కళ్యాణ్ గారే అని తాము గర్వంగా చెప్పగలమని, ప్రజలందరూ ఈ అంశాన్ని గుర్తించారని అన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు ప్రజలు సిద్ధపడ్డారని, పవనన్న ప్రభుత్వంలో రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని జనసేనపార్టీ ఆత్మకూరు నియోజకవర్గం ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్ తెలియజేసారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు చంద్ర, వంశీ, మస్తాన్ బాబు, రాకేష్, భాను కిరణ్, దినేష్, తిరుమల, పవన్, శ్రీహరి, ప్రసాద్, అనిల్, నాగరాజు, బాబు తదితరులు పాల్గొన్నారు.