అనంతపురం ( జనస్వరం ) : జనసేన పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు మూడవ విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని జనసేన జిల్లా అధ్యక్షులు టి.సి.వరుణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి, పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక సప్తగిరి సర్కిల్ లోని పార్టీ కార్యాలయంలో టి.సి.వరుణ్ గారి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథులుగా జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిలు చిలకం మధుసూదన్ రెడ్డి గారు విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ నెల 10వ తేదీ నుండి 28వ తేదీ వరకు మూడో విడత సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుందన్నారు. బలమైన స్ఫూర్తితో జనసేన నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. క్రియాశీలక సభ్యులే జనసేన సారథులని .. పార్టీ కోసం కష్టపడే ప్రతి ఒక్కరికి భవిష్యత్తులో సముచిత స్థానం ఉంటుందన్నారు. వైసిపి ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజలు విసిగి వేశారిపోయారని.. చిత్తశుద్ధి నిజాయితీ కలిగిన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలోనే జనసేన వైపు చూస్తున్నారన్నారు. కావున ప్రతి జనసైనికుడు పార్టీ విధివిధానాలను ... అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు మరియు సిద్ధాంతాలను ప్రజలకు వివరించి క్రియాశీలక సభ్యత్వలను అత్యధిక సంఖ్యలో నమోదు చేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యక్రమాల ప్రధాన కార్యదర్శిలు భవాని రవికుమార్, రాప్తాడు ఇంచార్జ్ సాకే పవన్ కుమార్, తాడిపత్రి ఇంచార్జ్ శ్రీకాంత్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు జయరాం రెడ్డి, అంకె ఈశ్వరయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శిలు పత్తి చంద్రశేఖర్, రాయలసీమ ప్రాంతీయ కమిటీ మహిళా సభ్యులు శ్రీమతి పసుపులేటి పద్మావతి, జిల్లా కమిటీ సభ్యులు, మండల అధ్యక్షులు మరియు పట్టణ అధ్యక్షులు తదితరులు పాల్గొనడం జరిగింది.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com