● ప్రజలలో పవన్ కళ్యాణ్ గారికి పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక సీబీఐ దత్తపుత్రుడు జగన్ మోహన్ రెడ్డి నిరాధార ఆరోపణలు చేయడం ఆయన అవివేకాని నిదర్శనం
● ఆత్మహత్య చేసుకున్న ప్రతి ఒక్క రైతు పూర్తి వివరాలు ఆధారాలతో సహా మాదగ్గర ఉన్నాయి
● నిజంగా రైతులకి ఈ సీబీఐ దత్తపుత్రుడు అంత మేలు చేసుంటే తన సొంత జిల్లా కడపలో 130 మందికి పైగా రైతులు ఎలా ఆత్మహత్య చేసుకున్నారు
● కోనసీమ అల్లర్ల పాపం ఈ వైసీపీ ప్రభుత్వానిదే
అనంతపురం, (జనస్వరం) : అనంతపురం జిల్లా జనసేన పార్టీ మహిళా కార్యాలయంలో రాయలసీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పెండ్యాల శ్రీలత మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిన్నటి రోజు ఉమ్మడి అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చిన సీబీఐ దత్తపుత్రుడు జగన్మోహన్ రెడ్డి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి ప్రజలలో ఆదరణ పెరుగుతోందని గ్రహించి పదేపదే నిరాధార ఆరోపణలు చేస్తూ దత్తపుతృడనడం సిగ్గుచేటని అన్నారు. అధికారంలో ఉండి కూడా ప్రభుత్వం చేయలేని గొప్ప పని ఆత్మహత్య చేసుకున్న 3వేల రైతు కుటుంబాలకు దాదాపు 30 కోట్ల రూపాయలు మా అధ్యక్షులవారు ఇస్తుంటే అది చూసి ఓర్వలేక సిబిఐ దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ ఒక్క రైతుని కూడా చూపించలేకపోయారు అని విమర్శించడం విడ్డూరంగా ఉందని తెలిపారు. మా అధ్యక్షులవారు అనంతపురంలో కౌలు రైతు భరోసా యాత్ర ఏప్రిల్ 12వ తేదీన అంటే మీరు ఈ రోజు సభ పెట్టిన రాప్తాడు నియోజకవర్గంలోని మన్నిల గ్రామంలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించి 33 మంది ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున పరిహారం అందించారని పవన్ కళ్యాణ్ ఏప్రిల్ 12వ తేదీన రైతు భరోసా పరామర్శకు వస్తారనగ మీ ప్రభుత్వ యంత్రాంగం ఆగమేఘాల మీద ఆత్మహత్య చేసుకున్న పూలకుంట రైతు చిన్న గంగయ్య భార్య అరుణ అకౌంట్ లో (31392210019176 ) లక్ష రూపాయలు ఏప్రిల్ 11వ తేదీన పవన్ కళ్యాణ్ పర్యటనకు వచ్చిన రోజు 12వ తేదీన ప్రభుత్వం ఆరు లక్షల రూపాయలు అకౌంటులో వేయడం నిజమా అబద్దమా? అని ప్రశ్నించారు. వీరి కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ గారు పరామర్శించడం వాస్తవం కాదా! అలాగే మన్నిల గ్రామంలో వడ్డే ఆంజనేయులు భార్య రామాంజి నమ్మ అకౌంట్లో ( 31202010027131) ఏప్రిల్ 11వ తేదీన లక్ష రూపాయలు ఏప్రిల్ 12వ తేదీన 6 లక్షలు వేశారు. అదేవిధంగా పి.తిమ్మాచారి భార్య లక్ష్మి కెనరా బ్యాంక్ అకౌంట్ లో (31202010019545 ) లక్ష రూపాయలు, మన్నీల గ్రామానికి చెందిన ఆత్మహత్య చేసుకున్న ఆదినారాయణ భార్య అకౌంట్లో ఏప్రిల్ 11వ తేదీన లక్ష రూపాయలు వేసిన విషయం నిజం కాదా? ఇలా చెప్పుకుంటూ పోతే ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రతి ఒక్క ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి పవన్ కళ్యాణ్ గారు పరామర్శకు వస్తున్నారని వారి అకౌంట్ లో డబ్బులు వేసి వారిని సభకు రాకుండా అడ్డుకున్న విషయం వాస్తవం కాదా? వీరి కుటుంబాలకు పవన్ కళ్యాణ్ పరామర్శించడం వాస్తవం కాదా అని ఈరోజు మీడియా ముఖంగా ఈ సిబిఐ దత్తపుత్రున్ని అడుగుతున్నాం. మా అధ్యక్షులవారు ప్రజలకు మాత్రమే దత్తపుత్రుడని తెలియజేస్తూ ఈరోజు రాష్ట్రాన్ని అబద్ధపు హామీలతో బ్రష్టు పట్టిస్తు దేశంలోనే రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలుపుతా అనడం సిగ్గుచేటు కొత్త జిల్లాల పేర్లతో రాజకీయం చేసి కోనసీమను తగలబెట్టిన పాపం మీ వైసిపి ప్రభుత్వానిదే. సామాజిక న్యాయం పేరుతో రాష్ట్రంలో మీ భజన మంత్రులతో బస్సు యాత్రను చేపట్టారు. రాష్ట్రంలో సామాజిక న్యాయం ఎక్కడ ఉంది. 980 నామినేటెడ్ పోస్టులలో 782 మందిని 12 విశ్వవిద్యాలయాలలో 10మంది ఉపకులపతులను మీ సామాజిక వర్గం వారినే నియమించుకొని ఒక నియంతలాగా పరిపాలన కొనసాగిస్తూ ఈరోజు మీరు మా నాయకున్ని విమర్శించడం మీ తెలివి తక్కువ తనానికి నిదర్శనంగా భావిస్తున్నామని అన్నారు. నిజంగా మీకు రైతుల మీద వారి అభివృద్ధి మీద చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో దాన్యం కొనుగోలు చేసి నిర్ణీత సమయంలో రైతులకు డబ్బులు చెల్లించండి. ఎన్నికల హామీలో 12,500 రూపాయలు ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి సాయం కింద అందిస్తానని ఇప్పుడు 7500 ఇస్తున్నారని సీబీఐ దత్తపుత్రుని ప్రభుత్వం ప్రజలకు మేలు చేస్తుంటే తన సొంత జిల్లాలో 130 మందికి పైగా రైతులు ఎలా ఆత్మహత్య చేసుకున్నారని ఈ పాపం సిబిఐ దత్తపుత్రుడిదే అని తెలియజేస్తూ మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు సేంద్రియ వ్యవసాయానికి సబ్సిడీ కింద డ్రిప్ సిస్టంని అందించలేదు. మీరు చెప్పిన RBK కేంద్రాలలో రైతులు పడిగాపులు కాస్తున్న కౌలు కార్డులు అందించడం లేదు. అలాగే పొంతన లేని విధంగా పదవ తరగతి ఉత్తీర్ణత శాతాన్ని గుజరాత్ రాష్ట్రంతో పోల్చి చూడడం సీబీఐ దత్తపుత్రుడి అవివేకానికి నిదర్శనం. ఈ సీబీఐ దత్తపుత్రుడు 2019 ఎన్నికల్లో చెప్పిన అబద్ధాలని పదే పదే చెప్పి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని నిలువుదోపిడీ చేసి అబద్ధపు మాటలతో ఇప్పుడు కూడా ప్రజలను నమ్మించాలని చూస్తున్నారని కానీ మా నాయకునికి ప్రజలలో ప్రేమ విశ్వాసం ఉందని రాష్ట్ర ప్రయోజనాల కోసం అభివృద్ధికోసం ఆలోచించే గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ అని కాబట్టి రాబోయే ఎన్నికలలో జనసేన ప్రభుత్వాన్ని ఖచ్చితంగా స్థాపిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పసుపులేటి పద్మావతి, అనంతపురం జిల్లా కార్యదర్శి కాశెట్టి సంజీవరాయుడు, అనంతపురం నగర ప్రధాన కార్యదర్శి పెండ్యాల చక్రపాణి, వీర మహిళ కాశెట్టి సావిత్రి, నాయకులు తోట ప్రకాష్ పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com