Logo
Date of Publish : 04 May 2022, 4:24 pm
Editor : Sake Naresh

జనసేన వీరమహిళ వివాహానికి ఆర్థిక సాయం చేసిన పెండ్యాల దంపతులు

    అనంతపురం, (జనస్వరం) : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి సేవా స్ఫూర్తితో రాయలసీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పెండ్యాల శ్రీలత, జిల్లా నాయకులు పెండ్యాల హరి అనంతపురం అర్బన్ నియోజకవర్గం నారాయణపురం పంచాయతీ భువనేశ్వర్ నగర్ కు చెందిన జనసేన కార్యకర్త సురేంద్ర, ప్రమీల దంపతుల కుమార్తె పద్మావతి వివాహానికి రూ 10 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా నూతన వధువు పద్మావతి మాట్లాడుతూ గత రెండు నెలల క్రితం మా నాన్న సురేంద్ర ఆకస్మికంగా మృతి చెందారని, దీంతో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న తమకు పెండ్యాల దంపతులు అండగా నిలిచారన్నారు. క్లిష్ట సమయంలో మా కుటుంబానికి అండగా నిలిచి, రెండు నెలల క్రితం మా కుటుంబానికి నిత్యావసర సరుకులు, ఆర్థిక సాయం అందించారన్నారు. ఆ తర్వాత వివాహ విషయం వారి దృష్టికి రావడంతో తాము అన్నివిధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారన్నారు. ఇంటి ఆడబిడ్డగా పట్టుచీర కానుకగా ఇచ్చి, రూ 10,000 ఆర్థిక సహాయం చేశారని, ఇబ్బందుల్లో ఉన్న జనసేన కార్యకర్త కుటుంబానికి పెండ్యాల దంపతులు ఇస్తున్న చేయూత మరువలేనిదన్నారు. అనంతరం జనసేన రాయలసీమ ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పెండ్యాల శ్రీలత మాట్లాడుతూ తమ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి సేవా స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. భవిష్యత్తులో కూడా వీటిని కొనసాగిస్తామని పేర్కొన్నారు. జనసేన కార్యకర్తలకు అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు మురళి, జిల్లా కార్యదర్శి కాశెట్టి సంజీవ రాయుడు, వీర మహిళ కాశెట్టి సావిత్రి, నాయకులు తోట ప్రకాష్, దండు హరీష్ కుమార్ తదితరులు పాల్గొనడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com