పెందుర్తి, (జనస్వరం) : పెందుర్తి నియోజకవర్గం సుజాతనగర్ పార్టీ కార్యాలయం నందు పెందుర్తి నియోజకవర్గ నాయకులు శ్రీ వబ్బిన జనార్దన శ్రీకాంత్ గారు మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉక్కు కార్మికులు, నిర్వాసితులు ఆహ్వానం మేరకు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని మరింత బలం చేకూర్చేలా గా అధికార ప్రభుత్వాన్ని అఖిలపక్షం పెట్టమని కోరగా స్థానిక అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ గారు సభ సూచనలు తప్పుదోవ పెట్టేవిధంగా వ్యక్తిగత దూషణలకు వెళ్లడాన్ని తీవ్రంగా ఖండించారు. విశాఖపట్నం ఎమ్మెల్యే అయి ఉండి ముఖ్యమంత్రివర్యులు శ్రీ జగన్ రెడ్డి గారికి అఖిలపక్షం పెట్టమని సూచన ఇవ్వకుండా పవన్ కళ్యాణ్ గారిపై వ్యక్తిగత దూషణలు చేయడం ఏంటని అని, పవన్ కళ్యాణ్ గారిపై పాచి మాటలు మాట్లాడినందుకుగాను హార్పిక్ బాత్రూం క్లీనర్ ను మీ ఇంటికి పోస్ట్ ద్వారా పంపిస్తాము నోరు కడుక్కోమనీ సూచిస్తూ! మరొక్కసారి ఇటువంటి మాటలు మాట్లాడితే మీ ఇంటికి వచ్చి జనసైనికులు వీరమహిళలు మీ నోటిని శుభ్రం చేస్తామని హెచ్చరించడం జరిగింది. అలాగే మీ నాన్నగారు స్వర్గీయ గుడివాడ గురునాధరావు గారు కాంగ్రెస్ పార్టీ లో విలువలతో రాజకీయం చేస్తే మరణానంతరం మీరు మీ అమ్మగారి ఎమ్మెల్యే కోసం టిడిపిలో జాయిన్ అయ్యారు, అప్పుడు మీ అమ్మగారు ఓటమి కూడా చెందారు, మీరు కార్పొరేటర్ గా గెలిచి టిడిపిలో చంద్రబాబునాయుడు గారు ని భుజాలకెత్తుకొని తిరిగారు. మరలా మీరు టిడిపిని వదిలేసి వైఎస్సార్సీపీ పార్టీలో జాయిన్ అయ్యి అనకాపల్లి ఎంపీగా ఓడిపోవడం కూడా జరిగింది. అధికారం కోసం పార్టీలు మార్చే మీరు మీ కుటుంబం స్థిరత్వం కోసం, ఓటమి కోసం పవన్ కళ్యాణ్ గారు కోసం మాట్లాడతారా! ఒక్కసారి చరిత్ర చూసుకోండి. రైల్వే జోన్ కోసం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు విశాఖపట్నంలో సందుల్లో తిరిగిన విషయాన్ని మీరు మర్చిపోయారా! విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం కూడా మీరు పాదయాత్ర చేసి ప్రజలను మభ్యపెడుతున్నారు. సార్వత్రిక ఎన్నికల ముందు మద్యపాన నిషేధం అని చెప్పి ఇప్పుడు మద్యం షాపులు జగన్ రెడ్డి గారి తెరిచి జగన్ రెడ్డి గారి పరిశ్రమలో తయారైన మద్యాన్ని ప్రభుత్వం తరఫున అమ్మి ఆదాయ మార్గంగా ఎంచుకుని ప్రజలు పిడుస్తున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తానని చెప్పి జాబ్ క్యాలెండర్ లో మోసం చేశారు. మీపై మాకు నమ్మకం లేదని పవన్ కళ్యాణ్ గారు చెప్పగా మీరు ఇప్పుడు నిజాయితీ నిబద్ధత కోసం పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తారా! పెందుర్తి ఎమ్మెల్యేగా మీ అమ్మగారు, అనకాపల్లి ఎంపీగా మీరు ఓడిపోయి ఇప్పుడు ఎంపీగా గెలిచారు. మీ యొక్క ఆర్థిక పరిస్థితులపై శ్వేతపత్రం రిలీజ్ చేయగలవా? మీకు ఎంత ఆదాయం వస్తుంది రోజుకు ఎంత ఖర్చు పెడతారు ప్రజలకు చెప్పగలవా? అలాంటి నీవు సినీ ఇండస్ట్రీలో సంపదలో అగ్రగామిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారిని మీరు ప్రశ్నిస్తారా! మంత్రి కావాలంటే వెళ్లి జగన్ రెడ్డి గారి కాలుని పీసుకోమని మీ నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని, మరొక్కసారి ఆంధ్ర ప్రదేశ్ మరియు విశాఖపట్నం ప్రజలను మోసం చేసే విధంగా మాట్లాడవద్దని ప్రజలు మిమ్మల్ని గమనిస్తున్నారు కావున మీరు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్లి అఖిలపక్షం పెట్టమని కోరాలని సూచించడం జరిగింది.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com