GVMC పరిధిలో ఇంటి పన్నును వైసీపీ ప్రభుత్వం భారీగా పెంచడం, ప్రజల నుంచి చెత్త రుసుము వసూలు చేయడాన్ని జనసేన పార్టీ నుంచి తీవ్రంగా వ్యతిరేఖిస్తూ జీవీఎంసీ కార్యాలయం నందు జోనల్ కమిషనర్ నీ కలిసి వినతిపత్రం అందించారు. కరోనా కష్టకాలంలో ప్రజలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం, కౌన్సిల్లో చర్చించకుండా చట్టానికి విరుద్ధంగా జీవో నెంబర్ 197, 198 తీసుకుని రావడం వలన GVMC పరిధిలోగల ప్రజలపై సుమారు 900 కోట్లు భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కావున పెద్ద మనసుతో ఈ GO వెనక్కి తీసుకోవాలని ప్రజల తరఫున కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ అభ్యర్థి కంచిపటి మధు, పెన్ననిటి పార్వతి గారు, వబ్బిన శ్రీకాంత్ గారు, తన కాల్ శ్రీనివాస్, మోటూరు చైతన్య, జుత్తడ శీను, ప్రసాద్ రాజా, సాయి,ప్రసాద్, బుదిరెడ్ల రాజు, మెండ సతీష్ గారు, పాల్గొన్నారు.