Logo
Date of Publish : 01 May 2022, 1:35 pm
Editor : Sake Naresh

పెద్దాపురం జనసేన పార్టీ పట్టణ యువత ఆధ్వర్యంలో చలివేంద్రము ఏర్పాటు

     పెద్దాపురం, (జనస్వరం) : బాటసారులకు దాహం తీర్చేందుకు చలివేంద్రాలు ప్రతి ఒక్కరూ వీధివీధిన ఏర్పాటు చేయాలని జనసేన పార్టీ పెద్దాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ తుమ్మల రామస్వామి బాబు తెలిపారు. ఆదివారం పెద్దాపురం పట్టణంలో పెద్దాపురం జనసేన పార్టీ పట్టణ యువత ఆధ్వర్యంలో సంత మార్కెట్ వద్ద చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని తుమ్మల రామస్వామి బాబు చేతులు మీదుగా మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండుటెండల్లో బాటసారులకు దాహం తీర్చేందుకు ప్రజలకు ఈ చలివేంద్రములు దోహదపడుతుందని ఆయన తెలిపారు. ప్రతి సంవత్సరం జనసేన పార్టీ ఆధ్వర్యంలో క్రమం తప్పకుండా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని దీనిలో భాగంగా చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని అలాగే పెద్దాపురం నియోజకవర్గంలో పులిమేరు, సామర్లకోట పలు ప్రాంతాల్లో జనసేన పార్టీ యువత సహాయ సహకారాలతో ఇలాంటి సేవా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా జనసేన పార్టీ సహాయ కార్యదర్శులు చిటికెల నారాయణమూర్తి, కంచు మూర్తి రాజన్న, పిట్ట జానకి రామారావు, పెద్దాపురం 20 వార్డు కౌన్సిలర్ ఓబిలి శెట్టి వనిత, గణేష్, పెంకే వెంకట లక్ష్మి, పొలమరశెట్టి సత్తిబాబు, కటారి శ్రీను సహారా కోటి, ధర్మ, వంగలపూడి సతీష్ గున్ని, భగవాన్, బర్రె స్వామి మంచం సాయి, అత్తిలి కృష్ణ, చిటికెల త్రివేణి, ఎస్. ఎస్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com