ఆముదాలవలస ( జనస్వరం ) : జనసేన ఆధ్వర్యంలో జరిగిన యువశక్తి సభ విజయవంతం అవడంతో ప్రభుత్వ పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. అందులో భాగంగానే ఈ జిల్లా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఎప్పటిలాగే శృతిమించి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మీద చేసిన వ్యాఖ్యలను ఆముదాలవలస ఇంచార్జ్ రామ్మోహన్ తీవ్రంగా ఖండించారు. దువ్వాడ శ్రీను మాట్లాడిన మాటలు రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న ఏ ఒక్కరు కూడా హర్షించరని మరియు ఆయన కుటుంబ సభ్యులు కూడా హర్షించరని తెలిపారు. అలాగే దువ్వాడ శ్రీను ఇది మొదటిసారి కాకుండా గతంలో కూడా ఇలాగే తీవ్రమైన పరుష పదజాలాలను జనసేన అధ్యక్షులు వారి మీద ఉపయోగించడం జరిగింది. మరి పోలీస్ శాఖ ఇదంతా చూస్తూ ఎందుకు చోద్యం వహిస్తుంది? ఎందుకు సుమోటోగా ఆ వాఖ్యలను తీసుకుని ఆయన మీద కేసు పెట్టట్లేదు? అందుకే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తారు తప్పు చేస్తే తన మెడైన తెగే చట్టం తీసుకురావాలని చెబుతారు. భవిష్యత్తులో మళ్లీ దువ్వాడ ఎలానే నోరు జారితే జనసేన చూస్తూ ఊరుకోమని దువ్వాడకు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. మళ్లీ ఇటువంటి వాఖ్యలు మాట్లాడితే మేము మా జనసేన శ్రేణులు ఎంతకైనా తెగిస్తాయని ఘాటుగా హెచ్చరించారు.